బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 1 జులై 2024 (07:23 IST)

మొండి వైఖరితో బచ్చల మల్లి లో అల్లరి నరేష్ ఎం చేసాడు ?

Bacchal Malli  team
Bacchal Malli team
హీరో అల్లరి నరేష్ ఈరోజు తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా, తన అప్ కమింగ్ మూవీ 'బచ్చల మల్లి' మేకర్స్ హీరో ఇంటెన్స్ క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ ఒక స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి బ్లాక్ బస్టర్‌లను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా చాలా గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
 
హీరో ఇంటి దగ్గర లౌడ్‌స్పీకర్‌లో భగవద్గీత ప్లే చేయడంతో గ్లింప్స్ ఓపెన్ అవుతుంది, అది హీరో నిద్రకు భంగం కలిగిస్తుందని దానిని ఫెరోషియస్ గా రిమూవ్ చేస్తాడు. తర్వాత లోకల్ బార్‌లో స్టైల్‌గా ఆల్కహాల్ సేవించి, అక్కడ ఉన్న గూండాలతో ఫైట్ చేసిన ఎపిసోడ్ అదిరిపోయింది. “ఏయ్ ఎవడి కోసం తగ్గాలి... ఎందుకు తగ్గాలి' అంటూ అల్లరి నరేష్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ క్యారెక్టర్ మొండి వైఖరిని డిఫైన్ చేసింది.
 
అల్లరి నరేష్ ఇంతకు ముందు ఇలాంటి మాస్ క్యారెక్టర్ చేయలేదు. సుబ్బు అతన్ని మునుపెన్నడూ చూడని అవతార్‌లో ప్రెజెంట్ చేశాడు. నరేష్ పాత్ర కోసం ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ సాలిడ్ గా ఉంది. గ్లింప్స్ మాస్ అప్పీలింగ్ గా వుంది. ఇది పర్ఫెక్ట్ బర్త్ డే ట్రీట్, అల్లరి నరేష్ తన పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు.
 
అల్లరి నరేష్ సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
 
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు 'సీతా రామం' చిత్రానికి మ్యూజిక్ ఇచ్చిన విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా, మానాడు, రంగం, మట్టి కుస్తి వంటి చిత్రాలకు పనిచేసిన రిచర్డ్ ఎం నాథన్ డీవోపీగా చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్.
 
కథ, సంభాషణలు సుబ్బు స్వయంగా అందించగా, విప్పర్తి మధు స్క్రీన్‌ప్లే, ఎడిషనల్ స్క్రీన్‌ప్లే విశ్వనేత్ర అందించారు.
 
బచ్చల మల్లి సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.
 
తారాగణం: అల్లరి నరేష్, అమృత అయ్యర్, రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు.