గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 3 మే 2024 (14:51 IST)

ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లుగా నరేష్ సినిమా - రివ్యూ

aa okkati adakku
aa okkati adakku
నటీనటులు: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ తదితరులు
 సాంకేతికత: సినిమాటోగ్రఫీ: సూర్య, ఎడిటింగ్: ఛోటా కె ప్రసాద్, సంగీత దర్శకుడు: గోపీ సుందర్, దర్శకుడు: మల్లి అంకం, నిర్మాత: రాజీవ్ చిలక
 
అల్లరి నరేష్ కామెడీకి కాస్త గ్యాప్ ఇచ్చి సీరియన్ సినిమాలతో వచ్చాడు. కానీ తన అసలైన కమెడియన్ ను మరోసారి ప్రేక్షకులకు రుచిచూపించాలని చేసిన ప్రయత్నమే  “ఆ ఒక్కటీ అడక్కు”. తండ్రి ఇ.వి.వి. గారి సినిమా టైటిల్ ను ఈ సినిమాకు పెట్టి కథపరంగా తీశామని దర్శకుడూ చెప్పారు. మరి ఈరోజే విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ :
రిజిస్టార్ ఆపీస్ లో క్లర్క్ గా చేసే గణపతి(అల్లరి నరేష్) తమ్ముడుకు పెండ్లి అయి ఓ పిల్లాడు కూడా వుంటాడు. కానీ గనపతికి ఇంకా పెల్లి సెట్ కాదు. దాంతో అందరూ గణపతిలో ఏదో లోపం వుందని రకరకాలుగా కామెంట్లు చేస్తుంటారు. స్నేహితుడి సలహా మేరకు హ్యపీ మ్యాట్రిమోనీని సంప్రదిస్తాడు. ఆ మ్యాట్రిమోనీ ద్వారా పలువురిని చూసినా సెట్ కాదు. ఆఖరికి అందులో పనిచేసే  సిధి (ఫరియా అబ్దుల్లా) చూసి మనసు పారేసుకుంటాడు. కానీ ఆమె నేను నీకు సెట్ కాను అంటూ తిరస్కరిస్తుంది. ఆ తర్వాత కొన్ని నాటకీయ పరిణామల తర్వాత సిద్ది ఫేమ్ ఫెండ్లి కూతురు అని తెలుసుకుని గణపతి షాక్ కు గురవుతాడు. ఈ క్రమంలో ఆమె పనిచేస్తున్న మ్యాట్రిమోనియల్ లో పెద్ద కుటుంభకోనం జరుగుతుందని తెలిసి గణపతి ఏం చేశాడు? అనేది మిగిలిన కథ. 
 
సమీక్ష:
 
ఈ సినిమాలో కథ పెండ్లి, మ్యాట్రిమోని చుట్టూ సాగుతుంది. మధ్యలో ఇల్లు, ఇంటి చుట్టుపక్కల కాలనీ మనుషులు కామెంట్లు కోణంలో కథనం సాగుతుంది. అయితే ఎక్కడా ఫీల్ కలిగించదు. పాత ఫార్మెట్ తరహాలో హీరోయిన్ కనిపించగానే ఓ పాట పాడేసుకోవడం, డాన్స్ వేయడం జరుగుతుంది. హీరోకు పెండ్లి సమస్య ఎందుకు వస్తుందనేది కూడా సినిమా కథలా వుంటుంది. జీవితంలో సెటిల్ అయ్యేవరకు పెండ్లి చేసుకోకుండా తన కుటుంబాన్ని పోషించే పాత్ర హీరోది.
 
కాగా, గత సినిమాల్లో అల్లరి చేసే కామెడీ ఇందులో పెద్దగా కనిపించదు. ఇందుకు దర్శకుడు లోపమే కనిపిస్తుంది. ఇలాంటి కథను సరైన దర్శకుడు డీల్ చేస్తే సీరియస్ నెస్ తో పాటు వినోదం పండేది. ఈ సినిమాలో నటించిన పాత్రలు అన్నీ వారి పరిధిమేరకు నటించారు. ప్రత్యేకంగా జానీ లివర్ కూతురు జమి లివర్ మరిదిని ఆటపట్టించే విధంగా చూపే విధానం బాగుంది.  హర్ష చెముడు, వెన్నెల కిషోర్ తమ పాత్రకి న్యాయం చేశారు.
 
మొదటి భాగం సరదాగా సాగుతూ సెకండాఫ్ లోకి వచ్చేసరికి సీరియెస్ చూపించబోయే కన్ క్యూజ్ కూడా సినిమాటిక్ గా అనిపిస్తుంది. ఫైనల్ గా మ్యాట్రిమోనీలో జరిగే తంతు, మనుషుల ఎమోషన్స్ తో ఆడుకుని డబ్బు సంపాదించే వ్యాపారంగా ఎలా వుంటుందో ఇందులో చూపించాడు. అయితే ఆ కోణాన్ని మరింతగా ప్రజెంట్ చేసేవిధంగా తీస్తే మరింత బాగుండేది. ప్రస్తుతం పెండ్లి చూపుల పేరుతో పెండ్లయినవారి ఫొటోలు కూడా పెట్టి పెండ్లికానీ మగాళ్ళతో ఆడుకోవడం వంటివి కళ్ళకు కట్టినట్లు చూపించాడు.
 
ఇందులో పాటలు, సంగీతం పెద్దగా ఆకట్టుకోనివిగా అనిపిస్తాయి. కథనం ఫస్టాఫ్ తో పోలిస్తే కామెడీ యాంగిల్ మిస్ అయ్యి సీరియస్ గానే నడుస్తుంది. వీటితో సెకండాఫ్ మరీ అంత ఎంగేజింగ్ గా అనిపించదు. క్లైమాక్స్ పోర్షన్ కొంచెం వీక్ గా అనిపిస్తుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాల్సింది. అబ్బూరి రవి మాటలు కూడా పెద్దగా ఎట్రాక్ట్ గా అనిపించవు.  దర్శకుడు ఇంకాస్త మెరుగ్గా కథను మలిస్తే మరింత బాగుండేది.
రేటింగ్ : 2/5