గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 2 మే 2024 (15:13 IST)

అందరం 'ఆ ఒక్కటీ అడక్కు' చూద్దాం, హాయిగా నవ్వుకుందాం: హీరో అడివి శేష్

allari natre, adavi sesh an others
allari natre, adavi sesh an others
అల్లరి నరేష్  ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు' తో రాబోతున్నారు. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక తీశారు.  ఫరియా అబ్దుల్లా  హీరోయిన్.  అబ్బూరి రవి చిత్రానికి డైలాగ్స్ అందించారు. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. మే 3న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. హీరో అడివి శేష్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
 
హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. నరేష్ గారితో నాకు చాలా గొప్ప అనుబంధం వుంది. నా ఫస్ట్ ఆడియో లాంచ్ కి నరేష్ గారు ముఖ్య అతిధిగా వచ్చారు.  ఈ రోజు ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకోవడానికి రావడం చాలా ఆనందంగా వుంది. నా మనసులో నరేష్ గారు అంటే ఇంట్లో మనిషి.  ఆయన ఎప్పుడూ ఇతరుల ఆనందాన్ని కోరుకుంటారు. ఆయన్ని ఎప్పుడూ కలసి చాలా ఆత్మీయంగా వుంటుంది. అబ్బూరి రవి గారు  నా కెరీర్ కి బ్యాక్ బోన్. కలసి ఏడు సినిమాలు చేశాం. రాజీవ్ గారు ఐకానిక్ యానిమేషన్ మూవీస్ పిల్లల్ని ఎలా ఇన్స్పైర్ చేశారో అలాంటి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. ఫారియా ని ఫస్ట్ టైం కలిశాను. చాలా అమాయకంగా కనిపించారు. అదే ఇన్నోసెన్స్ కొనసాగిస్తే గర్వపడే స్థాయికి వెళ్తారు. మల్లికి నా బెస్ట్ విశేష్. మా అన్నయ్య టీంలో ఆయన పని చేశారు.మే3న అందరం థియేటర్స్ లో సినిమా చూద్దాం . హాయిగా నవ్వుకుందాం' అన్నారు.
 
అల్లరి నరేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను ఈ స్టేజ్ లో, ఇన్ని సంవత్సరాలు పరిశ్రమలో ఉన్నానంటే కారణం మా నాన్నగారు. ఆయన వున్నన్ని రోజులు నాతో సినిమాలు చేసి, హిట్లు ఇచ్చి, నన్ను సక్సెస్ ఫుల్ యాక్టర్ ని చేశారు. ఆయన లేనప్పుడు కూడా ఆయన టైటిల్ ఇచ్చి ఈ సినిమాతో బ్లెస్ చేస్తున్నారు. ఇది బరువుగా, భాద్యతగా ఫీలౌతున్నాను. తప్పకుండా ఆ మంచి పేరుని కాపాడతానని మాటిస్తున్నాను. ఈ వేడుకు వచ్చిన శేష్ గారికి, రవిగారికి, విజయ్ కనకమేడల, విజయ్ బిన్నీ, దేవాకట్టా గారికి పేరుపేరునా ధన్యవాదాలు. దర్శకుడిగా మల్లి అంకంకు ఇది మొదటి సినిమా. చాలా కాలంగా దర్శకుడు కావాలనే కలగని, ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా చేశారు. చాలా మంది కొత్త దర్శకులతో పని చేశాను. దాదాపు 32 మంది కొత్త దర్శకులని పరిచయం చేశాను. 31 మంది రిలీజ్ కి ముందు టెన్షన్ పడ్డారు. ఒక్క మల్లి గారు మాత్రం చాలా కూల్ గా నవ్వుతూ వున్నారు( నవ్వుతూ). అసలు టెన్షన్ అనే మాటే ఆయన డిక్షనరీలో లేదు.  నిజంగా అది గ్రేట్ గిఫ్ట్.  ఈ సినిమాతో పరిశ్రమకి రాజీవ్ గారు లాంటి మంచి నిర్మాత పరిచయం అవుతున్నారు. ఇలాంటి నిర్మాతలు పరిశ్రమకు చాలా అవసరం. ఈ సినిమా పెద్ద విజయం సాధించి, ఆయన మరో పది చిత్రాలు నిర్మించి, మరో పదిమందికి పని ఇవ్వాలని కోరుకుంటున్నాను. గోపిసుందర్ గారు నాలుగు బ్యూటీఫుల్ సాంగ్స్ ఇచ్చారు. అబ్బూరి రవి గారు, చోటా ప్రసాద్ గారు దాదాపు ఐదారు సినిమాల నుంచి ఒక ఫ్యామిలీలా వర్క్ చేస్తున్నాం.  ఈ సినిమాలో సాంగ్స్ చేసిన భాను మాస్టర్, రాజుసుందరం మాస్టర్, విజయ్ బిన్నీ మాస్టర్, రఘు మాస్టర్ అందరికీ థాంక్స్. భాస్కర భట్ల, రామజోగయ్యశాస్త్రీ గారికి ధన్యవాదాలు. ఫారియా వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. తనలో పెక్యులర్ కామెడీ టైమింగ్ వుంది. అది చాలా తక్కువ మందిలో వుంటుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించి మా జోడి మరో రెండు మూడు సినిమాలకు కొనసాగాలని కోరుకుంటున్నాను. జామి లివర్ యంగ్ వెర్షన్ అఫ్ కోవై సరళ లాంటి పాత్ర చేశారు. తన పాత్ర చాలా బావుటుంది. తనకి టాలీవుడ్ కి స్వాగతం.  ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమా మే3న విడుదల కాబోతుంది. ఈ మండు వేసవి మీ బాధలు మర్చిపోయి ఒక రెండు గంటలు హాయిగా ఈ సినిమాని థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి. ఈ సినిమా పెళ్లి కాని వాళ్ళు, పెళ్లి అయినవారు, పెళ్లి సంబంధాలు చూస్తున్నవారు, ప్రతిఒక్కరూ చూడాలి.  కామెడీ సినిమా చేసిన, సీరియస్ సినిమా చేసినా కంటెంట్ వున్న సినిమా చేస్తాను. ఈ సినిమా ఆర్గానిక్ కామెడీ. ఇందులో పెళ్లిపేరుతో జరుగుతున్న మోసాలని అందరికీ తెలియజేయాలనే మంచి ఉద్దేశంతో ఈ సినిమా చేయడం జరిగింది. మే3న థియేటర్స్ రండి అందరూ సరదాగా నవ్వుకోండి. అందరికీ ధన్యవాదాలు' తెలిపారు.
 
హీరోయిన్ ఫారియా అబ్దుల్లా మాట్లాడుతూ, నరేష్ గారి ఎంత పెద్ద థాంక్స్ చెప్పినా తక్కువే. కో యాక్టర్ గా చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమాతో నరేష్ గారి రూపంలో ఒక మంచి ఫ్రెండ్ దొరికారు. ఈ విషయంలో చాలా ఆనందంగా వుంది. దర్శకుడు మల్లిగారి ధన్యవాదాలు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరు ధన్యవాదాలు. ఈ హోల్సమ్ ఎంటర్ టైనర్ ని తెరపై చూడటానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను'' అన్నారు.
 
దర్శకుడు మల్లి అంకం మాట్లాడుతూ.. ముందుగా ఈవీవీ సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా జర్నీలో అమ్మిరాజు గారి ద్వారా నరేష్ గారిని కలిశాను. ఈ సందర్భంగా అమ్మిరాజు గారికి ధన్యవాదాలు.  భాను మాస్టర్ రఘు మాస్టర్ రాజు సుందరం మాస్టర్ పాటని అద్భుతంగా తీశారు. భాస్కర భట్ల, రామజోగయ్యశాస్త్రీ గారికి ధన్యవాదాలు.  చాలా ప్రేమతో లిరిక్స్ రాశారు. ఆర్ట్ డైరెక్టర్, డీవోపీ సూర్య , ఎడిటర్ చోటాకే ప్రసాద్,  ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ టీంకి ధన్యవాదాలు. అబ్బూరి రవి గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. మాటలు అద్భుతంగా రాశారు. నటీనటులందరికీ థాంక్స్. ఇందులో జామి లివర్ పాత్ర అందరినీ ఆకట్టుకునేలా వుంటుంది. ఫారియా ఈ సినిమాకి రావడం వలన సిద్దిగా పాత్ర చాలా హైలెట్ అయ్యింది. అడివి శేష్ మా వేడుకకు రావడం చాలా ఆనందంగా వుంది. నా ఫస్ట్ లవర్ నరేష్ గారు. దర్శకుడిగా అవకాశం రావడానికి చాలా స్ట్రగుల్ చేయాలి.  కొత్త దర్శకులకి అవకాశం ఇవ్వడానికి చాలా ఆలోచిస్తుంటారు. కానీ నరేష్ గారు ఇప్పటికే ముఫ్ఫై కి పైగా దర్శకులని పరిచయం చేశారు. ఆయన ఇలానే చేస్తూ మా లాంటి వారికి అండగా వుండాలి. రాజీవ్ గారు చాలా క్యాలిటీతో ఈ సినిమాని తీశారు. అందరినీ అలరించే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. తప్పకుండా ఆడియన్స్ ని అలరిస్తుంది' అన్నారు.
 
చిత్ర నిర్మాత రాజీవ్ మాట్లాడుతూ.. నా ప్రయాణంలో నన్ను సపోర్ట్ చేసిన నా కుటుంబానికి ధన్యవాదాలు. మల్లిగారు కథ చెప్పినప్పుడు నా మైండ్ లో నరేష్ గారే వచ్చారు. ఈ సినిమా ఆయన చేయడం మా అదృష్టం. ఈ సినిమాని చేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అబ్బూరి రవిగారు రైటింగ్ తో పాటు ఎమోషనల్ గా చాలా సపోర్ట్ చేశారు. ఫారియా చాలా అద్భుతంగా నటించారు. వెన్నెల కిశోర్, హర్ష, జామి లివర్ ఇలా నటీనటులంతా చాలా చక్కని ప్రతిభ కనబరిచారు. ఈ సినిమాకి పని చేసిన టెక్నికల్ టీం అందరికీ ధన్యవాదాలు. ఇది మా మొదటి సినిమా. ఎక్కడా రాజీపడకుండా చాలా క్యాలిటీగా నిర్మించాం. కామెడీ లో నరేష్ గారిని మించి ఎవరూ లేరు. నరేష్ గారి చాలా ఐడియాలు సినిమాలో వున్నాయి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి ధన్యవాదాలు. ఈ వేడుకకు అతిధులుగా వచ్చిన అందరికీ ధన్యవాదాలు. సునీల్ నారంగ్ గారు, సురేష్ బాబు గారు చాలా సపోర్ట్ చేశారు.  అందరినీ అలరించే సినిమా ఇది. తప్పకుండా థియేటర్స్ లో చూడండి' అని కోరారు