జూనియర్ ఎన్.టి.ఆర్. పేరును వద్దన్న బాలక్రిష్ట
నందమూరి బాలక్రిష్ణ, జూనియర్ ఎన్.టి.ఆర్.ల గురించి అందరికీ తెలిసిందే. ఇద్దరి మధ్యా వ్యత్యాసం చాలా వుందనేవార్తలు కూడా వచ్చాయి. కాగా, ప్రతి సినిమా ప్రమోషన్ కు బాలక్రిష్ణ చేస్తున్న అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ లో ఆయా సినిమా హీరోలను, నిర్మాత, దర్శకులను పిలిపించి చిన్నపాటి చిట్ చాట్ చేస్తుంటారు. అందులో పర్సనల్, సినిమాకు సంబంధించిన రకరకాల విషయాలు సరదాగా సాగుతాయి.
ఆమధ్య అల్లు అర్జున్ తో పుష్ప 2 టైంలో కూడా బాలక్రిష్ణ కొన్ని ప్రశ్నలకు అల్లు అర్జున్, ఆయన తల్లికూడా హాజరయ్యారు. ఇక ప్రస్తుతానికి వస్తే, ఇటీవలే దర్శకుడు బాబీ తెరకెక్కించిన ఢాకు మహారాజ్ సినిమా సందర్భంగా బాలయ్య ఇంటర్వ్యూ చేశారు. అందులో దర్శకుడు అంతకుముందు ఎన్.టి.ఆర్.తో చేసిన జై లవకుశ గురించి గానీ అడగవద్దనీ, అసలు ఎన్.టి.ఆర్. పేరును కూడా ప్రస్తావించకూడదనే నిబంధన పెట్టారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.
దీని గురించి దర్శకుడు బాబీని ఢాకు మహారాజ్ ట్రైలర్ మీట్ లో నేడు ప్రశ్న ఎదురైంది. అందుకు దర్శకుడు తెలివిగా ఏవోవో విషయాలు చెప్పాడు. బాలక్రిష్ణ గానీ, ఎన్.టి.ఆర్. గానీ సెట్ లో వున్నప్పుడు అభిమానులు చాలాదూరంనుంచి వస్తే కాస్త విసుక్కకునేవారు. ఎందుకంటే వాళ్ళు చాలాదూరం నుంచి వచ్చారు. తిరిగి సరిగ్గా వెళతారో లేదోనని ఆందోళనలో వుండేవారు. వారిపై అంతప్రేమ వుంటుంది అన్నారు.
ఆ వెంటనే అసలు పాయింట్ చెప్పలేదని విలేకరి అడిగితే... అన్ స్టాపబుల్ లో ఆ టైంలో ప్లే చేసిన క్లిప్పింగ్ ను బట్టే నేను చెప్పాను మినహా. బాలక్రిష్ణ గారు ఎన్.టి.ఆర్. సినిమా గురించి మాట్లాడ వద్దనిచెప్పలేదు. నేను చేసిన జై లవకుశ అంటే బాలక్రిష్ణకు ఇష్టం. ఈ విషయం లైవ్ లో వుండదు కాబట్టి నేను మీకు ప్రూఫ్ చూపించలేను అంటూ వివరించారు.