లాక్ డౌన్ తర్వాత షూటింగ్ రంగ ప్రవేశంలోకి నందమూరి బాలకృష్ణ

balakrishna
వి| Last Modified గురువారం, 29 అక్టోబరు 2020 (21:51 IST)
కరోనా నేపథ్యంలో చిత్ర పరిశ్రమలో షూటింగులు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రస్తుతం అన్ లాక్ 5 సడలింపుతో పలు హీరోలు తమ షూటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ ఈ రోజు నుంచి షూటింగ్ లోకి దిగారు. తనకు ఇప్పటికే రెండు హిట్లు ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ తన మూడో చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే.

ద్వారకా క్రియేషన్ బ్యానర్ పైన మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ ముందు ఈ చిత్రానికి సంబంధించిన ఒక షెడ్యూల్ కూడా పూర్తయ్యింది. తర్వాత లాక్ డౌన్ పడటంతో గత ఏడు నెలలుగా వాయిదా పడింది. ఈ క్రమంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ రోజు నుంచి హైదరాబాదులో తదుపరి షూటింగ్ నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా కూడా షూటింగ్‌లో పాల్గొన్నారు. బోయపాటి మార్క్ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీ మీనా కీలక పాత్ర పోషిస్తుండగా.. మళయాల ముద్దుగుమ్మ ప్రయాగ మార్టిన్‌ను కథానాయికగా ఎంపిక చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది.



దీనిపై మరింత చదవండి :