మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (10:08 IST)

బాలయ్య ఆ గాయాన్ని సైతం లెక్క చేయకుండా..

నందమూరి హీరో బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన డైలాగులు, నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు నందమూరి బాలయ్య. అయితే.. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నారు బాలయ్య. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న అఖండ సినిమా షూటింగ్‌ పూర్తి కాగా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
 
ఇక ఈ సినిమా విడుదల కు సిద్ధంగా ఉంది. అయితే.. బాలయ్య ప్రస్తుతం ఆహా కోసం ఓక టాక్‌ షో చేస్తున్నారు.ఈ షో కు సంబంధించిన ప్రమోషన్‌ అలాగే ఫోటో షూట్‌ కూడా నిన్న అన్నపూర్ణ స్టూడియోలో జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన కాలికి గాయం అయినట్లు సమాచారం అందుతోంది. 
 
అయితే.. బాలయ్య ఆ గాయాన్ని సైతం లెక్క చేయకుండా.. ఫోటో షూట్‌ పూర్తి చేసేశారట. ఈ విషయాన్ని ఆయన అభిమానులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. త్వరలోనే ప్రోమో, ఫోటోలోతో కలిపి ఆహా సంస్థ అధికారికంగా ప్రకటన చేయబోతున్నట్లు టాక్‌.