గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 30 సెప్టెంబరు 2019 (17:58 IST)

బాల‌య్యా... ఇది నిజ‌మా?

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ ప్ర‌స్తుతం 105వ చిత్రాన్ని చేస్తున్నారు. త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్. ర‌వి కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల విదేశాల్లో షూటింగ్ జ‌రుపుకున్న ఈ సినిమా అక్టోబ‌ర్ 5 నుంచి హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకోనుంది. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందే ఈ సినిమా డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది.
 
ఈ సినిమా త‌ర్వాత 106వ చిత్రాన్ని ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీనుతో చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. డిసెంబ‌ర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఇక 107వ చిత్రాన్ని డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌తో చేయ‌నున్నారని వార్త‌లు వ‌స్తున్నాయి. పైసా వ‌సూల్ చేసిన‌ప్పుడే పూరి, బాల‌య్య క‌లిసి మ‌రో సినిమా చేయాలి అనుకున్నారు. ఇటీవ‌ల ఈ మూవీ క‌న్ఫ‌ర్మ్ అయ్యింద‌ని టాక్ వినిపిస్తోంది. 
 
ఇక 108వ చిత్రాన్ని క్రిష్‌తో చేయ‌నున్న‌ట్టు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. బాల‌య్య క్రిష్‌తో గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా చేసారు. ఈ సినిమా ఘ‌న విజ‌యం సాధించింది. అయితే... ఇటీవ‌ల క్రిష్‌తో చేసిన క‌థానాయ‌కుడు 1, క‌థానాయ‌కుడు 2 ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వ‌డంతో క్రిష్ ఇప్ప‌టివ‌ర‌కు త‌దుప‌రి చిత్రం ఏంటి అనేది ప్ర‌క‌టించ‌లేదు. మ‌రోసారి బాల‌య్య‌తో సినిమా చేసేందుకు క్రిష్ క‌థ రెడీ చేస్తున్నార‌ని.. బాల‌య్య కూడా ఓకే చెప్పార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఇవి నిజ‌మా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.