శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 30 ఆగస్టు 2017 (14:12 IST)

వామ్మో... తెలుగు వృద్ధ హీరోలను అలా తీస్తే కొడ్తారు... రజినీ ఓ చింపిరి...

వయసు పైబడ్డాక ఎంతటి అందగత్తెలు, అందగాళ్లయినా చర్మం ముడతలు పడి, ముఖ వర్చస్సు తగ్గిపోయి, జుట్టు ఊడిపోయి ఇక మానవ జీవితం చరమాంకంలో కనబడటం సహజమే. కానీ కొందరు మాత్రం ముసలివాళ్లయినప్పటికీ తమ నిజ రూపాన్ని ప్రజల ముందు చూపించేందుకు అస్సలు ఇష్టపడరు. ఇక సెలబ్రిట

వయసు పైబడ్డాక ఎంతటి అందగత్తెలు, అందగాళ్లయినా చర్మం ముడతలు పడి, ముఖ వర్చస్సు తగ్గిపోయి, జుట్టు ఊడిపోయి ఇక మానవ జీవితం చరమాంకంలో కనబడటం సహజమే. కానీ కొందరు మాత్రం ముసలివాళ్లయినప్పటికీ తమ నిజ రూపాన్ని ప్రజల ముందు చూపించేందుకు అస్సలు ఇష్టపడరు. ఇక సెలబ్రిటీల సంగతి అయితే వేరే చెప్పక్కర్లేదు.
 
ముఖ్యంగా తెలుగు హీరోలకు చాలామందికి బట్టతలలు వున్నాయి. ఐతే వాటిని కవర్ చేసుకుంటూ విగ్గులు పెట్టుకుని బయట తిరుగుతుంటారు. అలాగే రోజువారీ జుట్టుకు, మీసాలు, గడ్డాలకు నల్ల రంగులు వేసుకోనిదే బయటకు రారు. వాళ్లు గనుక ఎలాంటి కృత్రిమ రంగులు వేయకుండా బయటకు వచ్చారో అసలు రంగు బయటపడుతుంది. 
 
కొన్నిసార్లు తమతమ ఇళ్ల వద్ద పొరబాటును బట్టతలతో ఏ హీరో అయినా కంటపడితే... వారి ఫోటోలను తీసుకునేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వారిని కొట్టి ఆ కెమేరాలు లాక్కున్న సందర్భాలు కూడా వున్నాయి. ఐతే ఇప్పుడు ఈ విషయం అంతా ఎందుకయా అంటే... బాలయ్య తన పైసా వసూల్ చిత్రానికి సంబంధించి జరిగిన పార్టీలో విగ్గు లేకుండా కనిపించి అందరినీ షాకింగుకు గురి చేశారట. 
 
ఎప్పుడూ విగ్గు లేకుండా బయటకు రాని బాలయ్య అలా విగ్గు లేకుండా వచ్చేసరికి అంతా షాక్ తిన్నారట. నిజానికి బాలయ్యకే కాదు.. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రాజేంద్ర ప్రసాద్‌తో పాటు పలువురికి బట్టతలలు వున్నాయి. మోహన్ బాబు చాలా రోజులుగా బట్టతలతోనే తిరుగుతున్నారు. ఇంకా ఆయన ప్రాణ స్నేహితుడు దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా సినిమా షూటింగ్ ముగిశాక అన్నీ తీసి అవతల పారేసి నిజ స్వరూపంతో బయట తిరుగుతుంటారు. 
 
ఆయన నిజ రూపాన్ని చూసి ఓ దేవాలయం వద్ద ఆయనేమైనా బిచ్చగాడేమోనని ధర్మం వేసిన మహిళ కూడా వుంది. రజినీకాంత్ మరీ ఇలా వుండటంపై ప్రశ్నిస్తే... దేవుడు ఇచ్చిన రూపాన్ని దాచేయడమెందుకు అని ఆయన ప్రశ్నిస్తారట. దటీజ్ రజినీ స్టైల్.