2వేల ఎపిసోడ్స్‌తో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో బాలికా వధు!
బాలికా వధుకు అరుదైన గౌరవం దక్కింది. తెలుగులో చిన్నారి పెళ్ళి కూతురు పేరుతో డబ్ అయిన బాలిక వధు సీరియల్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో ఈ ధారావాహికకు స్థానం దక్కింది. రాజస్థాన్ బ్యాక్ డ్రాప్‌లో కలర్స్ టీవీలో గత ఎనిమిదేళ్లుగా బాలికా వధు ప్రసారమవుతోంది.
మంచి స్టోరీలైన్, ఆదర్శనీయమైన పాత్రలతో నడుస్తున్న బాలికా వధు ప్రేక్షకులపై చాలా ప్రభావాన్ని చూపిందని.. బాలికా వధును ఆదిరిస్తోన్న ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని కలర్స్ ప్రోగ్రామింగ్ హెడ్ మనీషా శర్మ ఓ ప్రకటనలో తెలిపారు.
పెళ్లి కూతురు ఆనంది, ఆమె కూతురు నందిని చుట్టూ తిరిగే ఈ స్టోరీ 2వేల ఎపిసోడ్స్ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న డైలీ సీరియల్‌గా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కించుకుంది.