శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Updated : సోమవారం, 18 జనవరి 2021 (17:27 IST)

రాహుల్ ల‌వ‌ర్‌... పున‌ర్న‌వి కాదు అన్షునే..

Rahul_Anshu
సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్‌.. ల‌వ‌ర్ పున‌ర్న‌వి కాదు అన్షురెడ్డి అని ఖ‌రారు చేస్తూ.. ట్వీట్ చేశాడు. గ‌త కొంత‌కాలంగా వీరిద్ద‌రిపై వ‌స్తున్న వార్త‌లు స‌రైన స‌మాధానం దొర‌క‌లేదు. తాజాగా అన్షు ఇచ్చిన స్టేట్ మెంట్‌ను రాహుల్ బ‌ల‌ప‌రుస్తూ.. వెల్ల‌డించారు.  డ‌క్క‌న్ సినిమాల్లో త‌న‌దైన ముద్ర‌వేసి.. హైద‌రాబాదీ చిత్రాల‌కు పాట‌లు పాడుతున్న రాహుల్ ఒక్క‌సారిగా.. బిగ్ బాస్ సీజ‌న్ 3 ఫేట్ మార్చేసింది. 
 
దానితో ఆయ‌న‌కు ఎక్క‌డ లేని పేరు వ‌చ్చేసింది. ఆ షోలో త‌న‌కు బాగా ప‌రిచ‌యం, స్నేహం అయిన పున‌ర్ ర‌వితో ల‌వ్ వుంద‌నే వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఆ త‌ర్వాత వీరు ప‌లు టీవీ షోలో కూడా పాల్గొన్నారు. బ‌య‌ట వీరు చాలా హీపీగా క‌లుకునేవారు. కానీ ఓసారి ష‌డెన్‌గా.. నేను అన్షురెడ్డి ల‌వ్‌లో వున్నానంటూ పేర్కొన్నాడు. 
 
నిత్యం ఏదో విషయంలో సోషల్ మీడియాలో కనిపిస్తున్న రాహుల్ ఈ మధ్య కొంతకాలం పునర్నవి తో లవ్ లో ఉన్నాడు అంటూ వైరల్ అయ్యాడు. ఆ తరువాత కాదు నేను అన్షు రెడ్డి లవ్ లో ఉన్నాం అని తనే అధికారికంగా ప్రకటించి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. అయితే ఈ మధ్య రాహుల్ ఊకో కాకా అనే పేరుతో తన కొత్త క్లోతింగ్ బ్రాండ్ ని స్టార్ట్ చేసాడు. 
 
ఈ బ్రాండ్ ప్రమోషన్ లో భాగంగా ఫుల్ బిజీగా వున్న రాహుల్ తన గర్ల్ ఫ్రెండ్ అన్షు రొమాంటిక్ గా ఎత్తుకున్న పిక్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీనిపై అన్షు కూడా స్పందించి మేము ఇద్దరు మా ప్రేమలో లోతు వరకు ప్రయాణం చేసాం. మా బంధం బలపడింది అని తెలిపింది, దీనికి రాహుల్ సైతం మద్దతుగా నిలవడం నిదర్శనం.  వీరి బంధం చిర‌కాలం వుండాల‌ని ఆయ‌న అభిమానులు కోరుకుంటుంటే.. మ‌రికొంద‌రు రాహుల్ చేస్తున్న వ్యాపార ప్ర‌మోష‌న్ కు ఇది మ‌రింత లాభం చేరూరుస్తుందంటున్నారు.