గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 మార్చి 2023 (15:24 IST)

మే 12న బెల్లంకొండ శ్రీనివాస్ 'ఛత్రపతి' రిలీజ్

chatrapathi
ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'ఛత్రపతి'. గత 2005 సెప్టెంబరు 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రభాస్‌కు మంచి ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేశారు. 18 యేళ్ల క్రితం బాక్సాఫీస్ వద్ద సంచలనం విజయాన్ని నమోదు చేసుకున్న ఛత్రపతి మూవీని హిందీలోకి బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వివి వినాయక్ రీమేక్ చేశారు. 
 
గత కొన్ని రోజులుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి పోస్టరును సోమవారం చిత్రం బృందం రిలీజ్ చేసింది. అలాగే, విడుదల తేదీపై కూడా స్పష్టత నిచ్చింది. హిందీలో కూడా 'ఛత్రిపతి' అనే టైటిల్‌ను ఖరారు చేయగా, మే 12వ తేదీన విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఫస్ట్ లుక్‌ పోస్టరులో బెల్లంకొండ శ్రీనివాస్ కండలు తిరిగిన దేహంతో చేతిలో చెంబు పట్టుుకుని సముద్రం వైపు తిరిగి కనిపిస్తున్నారు. ఈ సినిమాను పెన్ స్టూడియోస్ బ్యానరుపై జయంతిలాల్ నిర్మిస్తున్నారు.