శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 4 అక్టోబరు 2019 (20:36 IST)

హీరోగా వ‌స్తున్న‌ బెల్లంకొండ శ్రీనివాస్ సోద‌రుడు...

డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్దకుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు శీను సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల రాక్ష‌సుడు సినిమాతో స‌క్స‌స్ సాధించిన సాయి శ్రీనివాస్ త‌దుప‌రి సినిమా చేసేందు రెడీ అవుతున్నాడు. 
 
ఇదిలావుంటే... ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త‌మ్ముడు బెల్లంకొండ గ‌ణేష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.  ఈ నెల 5వ తేదీన ఈ సినిమాకి పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. స‌క్స‌స్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బెక్కెం వేణుగోపాల్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.

వైవిధ్య‌మైన ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాకి పవన్ సాధినేని దర్శకత్వం వ‌హిస్తున్నారు. 1980 - 90 మధ్య కాలంలో జరిగే ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతుందని తెలిసింది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.