నాకు మళ్లీ అవకాశం ఇవ్వండి లిటిల్ బాస్ : బండ్ల గణేశ్

Bandla Ganesh
ఠాగూర్| Last Updated: బుధవారం, 2 అక్టోబరు 2019 (17:18 IST)
చిన్న నటుడు స్థాయి నుంచి బిగ్ ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి బండ్ల గణేశ్. ఈయన నిర్మించిన అనేక చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించాయి. అలాంటి వాటిలో గోవిందుడు అందరివాడేలే. రామ్ చరణ్ హీరోగా నటించగా, కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఈ చిత్రం గత 2014 అక్టోబరు ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని పురస్కరించుకుని నిర్మాత బండ్ల గణేశ్ ఓ ట్వీట్ చేశారు. రామ్ చరణ్‌ను లిటిల్ బాస్‌గా పేర్కొంటూ, మళ్లీ మీతో ఓ సినిమా తీయాలనుందని, ఆ సినిమాను బ్లాక్ బస్టర్‌గా ప్రజల ముందు ఉంచాలని భావిస్తున్నానని ట్వీట్ చేశారు. 'లిటిల్ బాస్ నాకు త్వరగా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను' అంటూ బహిరంగ విజ్ఞప్తి చేశారు.

కాగా, హీరోగా రాణిస్తూనే రామ్ చరణ్ నిర్మాతగా మారిన విషయం తెల్సిందే. ఈయన తన తండ్రి చిరంజీవి హీరోగా ఖైదీ నంబర్ 150 చిత్రం నిర్మించగా, తాజాగా 152వ చిత్రంగా సైరా నరసింహా రెడ్డి చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబరు రెండో తేదీన విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.దీనిపై మరింత చదవండి :