బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 25 సెప్టెంబరు 2019 (15:49 IST)

విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి హ‌రీష్ శంక‌ర్ కామెంట్స్.. ఇద్దరికీ ఏమైంది?

టాలెంటెడ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కించిన తాజా చిత్రం గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్. మెగా హీరో వ‌రుణ్ తేజ్ తో రూపొందించిన ఈ సినిమా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. స‌క్స‌స్ ఫుల్‌గా ర‌న్ అవుతోంది. ఈ మూవీ ప్ర‌మోష‌న్ లో భాగంగా ఓ ఛాన‌ల్ కి ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో హ‌రీష్ శంక‌ర్ చెప్పిన కొన్ని విష‌యాలు వార్త‌ల్లో నిలిచాయి. 
 
ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే... హీరో విజ‌య్ దేవ‌ర‌కొండతో సినిమా చే్యాల‌నే ఉద్దేశ్యంతో ఓసారి క‌లుద్దామా అని హ‌రీష్‌ శంక‌ర్ మెసేజ్ పెట్టాడ‌ట‌. దీనికి విజ‌య్ దేవ‌ర‌కొండ‌... రెండు సంవ‌త్స‌రాల వ‌ర‌కు ఖాళీగా లేను. సినిమా కోస‌మైతే క‌ల‌వ‌లేను. సినిమా కాక‌పోతే క‌లుద్దాం అని మెసేజ్ పెట్టాడ‌ట‌. దీనికి హ‌రీష్ శంక‌ర్... నీతో సినిమా కాకుండా నాకు ప‌నేం ఉంటుంది అని మెసేజ్ పెట్టాడ‌ట‌. 
 
ఈ విష‌యాన్ని స్వ‌యంగా హ‌రీష్ శంక‌రే చెప్పాడు. ఈ విష‌యం తెలిసిన్ప‌టి నుంచి విజ‌య్, హ‌రీష్ మ‌ధ్య ఏదో జ‌రిగింది అని ప్ర‌చారం జ‌రుగుతోంది.
 
ముక్కుసూటిగా మాట్లాడే హ‌రీష్ శంక‌ర్.. విజ‌య్‌తో సినిమా చేయాల‌నుకున్నాడు కానీ... విజ‌య్ స‌మాధానంతో బాగా హ‌ర్ట్ అయ్యాడ‌ని.. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా ఉండ‌క‌పోవ‌చ్చు ఏమో అంటూ ఫిల్మ్ న‌గ‌ర్‌లో టాక్ వినిపిస్తోంది. మరి.. హ‌రీష్ శంక‌ర్ కామెంట్స్ పై విజ‌య్ దేవ‌ర‌కొండ స్పందిస్తాడో లేదో వేచి చూడాలి.