ఆ సందర్భంగా పవన్ కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది.. వాల్మీకి దర్శకుడు (video)

Last Updated: శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (13:51 IST)
''వాల్మీకి'' సినిమాకు దర్శకత్వం వహిస్తున్న హరీష్ శంకర్ గురించి ప్రస్తుతం టాలీవుడ్ జనాలు మాట్లాడుకుంటున్నారు. వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటించిన వాల్మీకి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఈ సినిమాకు పేరు కూడా మారిపోయింది. వాల్మీకి కాస్త గద్దలకొండ గణేష్‌గా మారిపోయింది.


దీంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ మూవీ టైటిల్ ను మార్చవలసిన పరిస్థితులు ఏర్పడినా మరింత రెట్టించిన ఉత్సాహంతో ఈ మూవీని ప్రమోట్ చేస్తూ హరీష్ శంకర్ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో జరిగిన ఏ ఘటనను గుర్తు చేసుకున్నాడు. గతంలో హరీష్ శంకర్ పవన్‌తో గబ్బర్ సింగ్ తీశాడు. ఆ చిత్రంలోని ఓ పాటలో పవన్‌ను నటింపజేయడానికి తాను పవన్ కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేసుకున్నాడు.

'గబ్బర్ సింగ్' మూవీ షూటింగ్ స్విట్జర్లాండ్‌లో జరిగినప్పుడు 'పిల్లా నువ్వులేని జీవితం' అనే సాంగ్ ను షూట్ చేస్తున్న సమయంలో పవన్‌కు విపరీతంగా వెన్నునొప్పి వచ్చింది. దీంతో షూటింగ్ ఆపేసి హైదరాబాదుకు వెళ్తానని చెప్పాడు. వెన్నునొప్పి తగ్గాక మళ్లీ షూట్ చేద్దామని పవన్ చెప్పారు. కానీ ఆ పాటకు స్విజ్ వాతావరణం బాగుంటుందని తాను పవన్‌కు నచ్చజెప్పడమే కాకుండా ఒత్తిడి చేయడంతో పాటు.. ఆయనతో తనకున్న చనువు కారణంగా పవన్‌ను ఒప్పించేందుకు ఆయన కాళ్లు పట్టుకున్నానని చెప్పుకొచ్చాడు హరీష్ శంకర్.

దీనితో షాక్ అయిన పవన్ తన వెన్ను నొప్పిని భరిస్తూ ఆ పాటను పూర్తి చేసాడని పవన్ షూటింగ్ స్పాట్‌లో పడేంత కష్టం చాలా తక్కువ మంది హీరోలు పడతారు అంటూ పవన్‌పై హరీష్ శంకర్ ప్రశంసల వర్షం కురిపించారు. పవన్‌ను తాను ఎప్పుడు కలిసినా ఎక్కువ సమయం తన గురించి తన కుటుంబం గురించి అడుగుతూ ఉంటాడని హరీష్ శంకర్ అన్నాడు.

సక్సస్ వచ్చిందని అహంకారంలోకి వెళ్ళద్దని సూచనలు ఇస్తూ జీవితంలో ఎలా ఎదగాలో తనకు ఒక అన్నయ్యలా సూచనలు పవన్ ఇచ్చే విషయాన్ని బయట పెట్టాడు. ఇప్పటివరకు తాను ఎంతోమంది హీరోలతో సినిమాలు చేసినా ఏ హీరో కూడా తనతో పవన్‌లా ఆత్మీయంగా మాట్లాడిన సందర్భాలు లేవు అంటూ కామెంట్స్ చేసాడు.

దీనిపై మరింత చదవండి :