గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: గురువారం, 19 సెప్టెంబరు 2019 (21:54 IST)

వాల్మీకి టైటిల్ మార్పు.. ఏంటో తెలిస్తే షాకే..?

వరుణ్ తేజ్ నటించిన నా వాల్మీకి సినిమా రేపు విడుదల కాబోతోంది. వాల్మీకి టైటిల్ మార్చాలని బోయ సామాజిక వర్గం వారు గత కొన్ని రోజులుగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు. హైకోర్టు కూడా ఆ బోయ సామాజిక వర్గం వారు కొంతమంది వెళ్లడంతో కొద్దిసేపటి క్రితం కోర్టు టైటిల్ మార్చాలని దర్శకుడు హరీష్ శంకర్‌ను ఆదేశించింది.
 
వాల్మీకి టైటిల్ పైన వివాదం రేగుతున్న నేపథ్యంలో గద్దలకొండ గణేష్ అనే పేరును ఖరారు చేశారు. రేపు ఉదయం సినిమా విడుదలలో ఈ టైటిల్‌ని పెట్టబోతున్నారు. చివరి నిమిషంలో టైటిల్ మారడం అభిమానులు తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.