సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 13 డిశెంబరు 2018 (14:16 IST)

టాప్-10 ఇండియన్ సినిమాల్లో తెలుగు నుంచి ఆ రెండు...

భారతీయ చలన చిత్ర పరిశ్రమ చరిత్రలో తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ విషయం ఇపుడు మరోమారు నిరూపితమైంది. 2018 సంవత్సరానికిగాను ఇండియన్ టాప్-10 మూవీస్ జాబితాలో రెండు తెలుగు చిత్రాలు చోటుదక్కించుకున్నాయి. వీటిలో సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన "మహానటి" కాగా, రెండోది "రంగస్థలం". ఈ విషయాన్ని ఇంటర్నెట్ మేనేజ్‌మెంట్ డాటాబేస్ వెల్లడించింది.
 
"మ‌హాన‌టి" చిత్రం అభిన‌వ నేత్రి సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్క‌గా ఇందులో కీర్తి సురేష్ లీడ్ రోల్ పోషించారు. స‌మంత‌, దుల్క‌ర్ స‌ల్మాన్, విజ‌య్ దేవ‌ర‌కొండ కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించారు. మేలో విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించ‌డ‌మేకాక ఇండియన్‌ పనోరమలో తెలుగు చిత్రపరిశ్రమ నుంచి ప్రదర్శన కోసం ఎంపికైన సినిమాగా నిలిచింది. 
 
ఇకపోతే, లెక్క‌ల మాస్టారు కె.సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన "రంగ‌స్థ‌లం" చిత్రం ఎంత భారీ విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. "బాహుబలి" తర్వాత అత్యధిక వసూళ్లను సాధించిన రెండో చిత్రంగా రికార్డు సృష్టించింది. రాంచ‌ర‌ణ్‌, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఈ చిత్రంలో అన‌సూయ‌, ప్ర‌కాశ్ రాజ్, జ‌గ‌ప‌తి బాబు, ఆది పినిశెట్టి ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించారు. 
 
ఐఎండీబీ 2018 టాప్ 10 మూవీస్‌లో చోటుదక్కించుకున్న చిత్రాల వివరాలను పరిశీలిస్తే, 
 
1. అంధాదున్ (హిందీ)
2. రట్సాసన్ (తమిళం)
3. 96 (తమిళం)
4. మహానటి (తెలుగు)
5. బడాయి హో (హిందీ)
6. ప్యాడ్ మ్యాన్ (హిందీ)
7. రంగస్థలం (తెలుగు)
8. స్త్రీ (హిందీ)
9. రాజీ (హిందీ)
10. సంజు (హిందీ)