సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 25 అక్టోబరు 2018 (16:12 IST)

బుల్లితెరపై ''రంగస్థలం'' రికార్డ్..

''రంగస్థలం'' సినిమా వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా సత్తా చాటుకుంది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత జంటగా నటించిన రంగస్థలం మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా బుల్లితెరపై 19.5 టీఆర్పీ రేటింగ్‌ను తెచ్చుకుంది. చరణ్ సినిమాల్లో బుల్లితెరపై ఈ స్థాయి రేటింగ్ సాధించిన సినిమా రంగస్థలం అని సినీ పండితులు చెప్తున్నారు. 
 
ఈ సినిమా విడుదలకు తర్వాత రూ.200 కోట్లకి పైగా గ్రాస్‌ను .. రూ.120 కోట్లకి పైగా షేర్‌ను వసూలు చేసింది. అలాంటి ఈ సినిమా క్రితం వారం బుల్లితెరపై ప్రసారమైంది. ఈ సందర్భంగా టీఆర్పీ రేటింగ్‌లో ఈ సినిమా అదరగొట్టింది. ఇక జగపతిబాబు, అనసూయ, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.