శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 19 అక్టోబరు 2018 (17:54 IST)

పసుపు పచ్చని చీర.. గజ్జెల సవ్వడి.. ఆ రాత్రి ఆలయం చుట్టూ..?

రాత్రిపూట ఆలయాల్లో దేవతామూర్తులు సంచరిస్తారని.. ఆ ప్రాంత ప్రజల సంరక్షణార్థం కాపలా కాస్తారని పెద్దలు చెప్తుంటారు. అలాంటి ఘటనే నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.

రాత్రిపూట ఆలయాల్లో దేవతామూర్తులు సంచరిస్తారని.. ఆ ప్రాంత ప్రజల సంరక్షణార్థం కాపలా కాస్తారని పెద్దలు చెప్తుంటారు. అలాంటి ఘటనే నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్ వీడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది.


జ్వాలాముఖి అమ్మవారి ఆలయానికి రాత్రి వేళలో తాళాలు వేసిన తర్వాత, ఓ మహిళ పసుపు పచ్చని చీరతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. 
 
అయితే ఆలయ నిర్వాహకులు మాత్రం అమ్మవారి ఆలయాన్ని రాత్రి పదింటికే మూతలు వేశామని అంటున్నారు. పది గంటలకల్లా.. ఆలయాన్ని మూతపెడితే.. దేవాలయం లోపల ఎవరూ వుండే అవకాశం లేదని నిర్వాహకులు నొక్కి చెప్తున్నారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ వీడియోలో మాత్రం పసుపు పచ్చని చీరలో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన మహిళా రూపం కనిపిస్తోంది. 
 
భక్తులు మాత్రం ఆమె స్వయంగా అమ్మవారేనని అంటున్నారు. రాత్రిపూట తమకు గజ్జెల చప్పుడు కూడా వినిపించిదని చుట్టుపక్కల వారు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.