శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 23 సెప్టెంబరు 2018 (16:08 IST)

చిన్ననాటి గురువులతో పవన్ కళ్యాణ్ .. చిన్ననాటి ఫోటో చూసి మురిసిపోయాడు...

జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకు విద్యాబుద్ధులునేర్పిన చిన్ననాటి గురువులను నెల్లూరు పట్టణంలో కలుసుకున్నారు. వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారితో ఆయన తన చిన్ననాటి జ్ఞాపకాలన

జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకు విద్యాబుద్ధులునేర్పిన చిన్ననాటి గురువులను నెల్లూరు పట్టణంలో కలుసుకున్నారు. వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారితో ఆయన తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం తన గురువులను సన్మానించారు. ఈ సందర్భంగా చిన్ననాటి గ్రూపు ఫోటోను చూసి మురిసిపోయారు. ఆ విషయాన్నితన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
 
అంతకుముందు ఆయన నెల్లూరు పట్టణంలో జరిగే ప్రఖ్యాత రొట్టెల పండుగ కోసం వెళ్లారు. తన స్నేహితుడు, కమెడియన్ అలీని వెంటబెట్టుకుని నెల్లూరుకు చేరుకున్నారు. ఇందుకోసం తెల్లవారుజామున పవన్, అలీ శంషాబాద్ నుంచి రేణిగుంటకు విమానంలో చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరుకు చేరుకుని స్వర్ణాల చెరువు వద్ద రొట్టెల పండుగలో పాల్గొన్నారు. అనంతరం అలీతో కలసి బారా షహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 
 
ఈ కార్యక్రమాలు ముగిసిన తర్వాత జెట్టి శేషారెడ్డి భవన్‌లో జనసేన ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. పరిమితి సంఖ్యలోనే కేవలం ఎంపిక చేసిన 50 మందితోనే పవన్ సమీక్ష నిర్వహించారు. ఇక హిందూ, ముస్లింల ఐక్యతకు చిహ్నంగా నిలిచే నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ ఎంతో ప్రసిద్ధమైంది. ఐదు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలు వైభవంగాసాగుతున్నాయి.