స్క్యూబా డైవింగ్ చేస్తూ ప్రమోజ్ చేశాడు.. అందుకే ఓకే చెప్పేశా.. మెహరీన్
టాలీవుడ్ హీరోయిన్లలో మెహరీన్ ఒకరు. ఈమె త్వరలోనే ఓ ఇంటికి కోడలు కానుంది. భవ్య అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోనుంది. వీరిద్దరి వివాహం డెస్టినేష్ మ్యారజ్ విధానంలో జరుగనుంది. ఇప్పటికే వీరి నిశ్చితార్థం కూడా ముగిసిపోయింది. ఇది మార్చి 12వ తేదీన జరిగింది.
మరి కొద్ది రోజులలో పెళ్లి పీటలెక్కనున్న మెహరీన్ తన ప్రేమ, పెళ్లి ముచ్చట్లను మీడియాతో పంచుకుంది. భవ్యతో లాక్డౌన్ సమయంలోనే పరిచయం ఏర్పడిందని, ఫోన్ ద్వారా ఎక్కువ సంభాషించుకునే వాళ్లమని చెప్పింది.
భవ్య బర్త్ డే రోజు అండమాన్ వెళ్ళగా ఇద్దరం స్క్యూబా డైవింగ్ చేశాం. ఆ సమయంలో సముద్ర గర్భంలో నాకు ప్రపోజ్ చేశాడు. మోకాలిపై కూర్చొని విల్ యూ మ్యారీ మీ అంటూ తన ప్రేమను వ్యక్త పరిచాడు.
మొదట కాస్త ఆశ్చర్యం కలిగిన తర్వాత అతని ప్రపోజల్‌కు ఓకే చెప్పేశాను. పెళ్లి తర్వాత మెహీన్ సినిమాలు చేస్తుందా అంటే దీనిపై ఇంకా పూర్తి క్లారిటీ అయితే లేదనే చెప్పాలి. కాగా, వీరిద్దరి నిశ్చితార్థం జైపూర్‌లోని అలీలా కోటలో జరిగింది.