బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 2 జూన్ 2018 (11:24 IST)

బిగ్ బాస్‌లో పాల్గొనడం లేదని నిర్ధారించిన సెలెబ్రిటీలు, మరి శ్రీరెడ్డి...

బిగ్ బాస్ షో 1 ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. త్వరలో బిగ్ బాస్ 2 ప్రారంభం కానున్న నేపథ్యంలో దాని గురించి ఎన్నో వార్తలు చక్కర్లు చేస్తున్నాయి. ఇప్పటికే షో హోస్ట్‌గా నాని వ్యవహరిస్తున్నారనే విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయన నిర్ధారించారు. ఇక షోల

బిగ్ బాస్ షో 1 ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. త్వరలో బిగ్ బాస్ 2 ప్రారంభం కానున్న నేపథ్యంలో దాని గురించి ఎన్నో వార్తలు చక్కర్లు చేస్తున్నాయి. ఇప్పటికే షో హోస్ట్‌గా నాని వ్యవహరిస్తున్నారనే విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయన నిర్ధారించారు. ఇక షోలో పాల్గొనబోతున్న పార్టిసిపెంట్స్ లిస్ట్ అంటూ అనేక వెబ్‌సైట్‌లలో పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. 
 
కాగా వారిలో కొంతమంది తాము బిగ్ బాస్ 2 తెలుగులో పాల్గొనడం లేదని వివిధ మార్గాలలో నిర్ధారిస్తున్నారు. వీరిలో ధన్య బాలకృష్ణన్, చాందినీ చౌదరి ఇప్పటికే ఈ విషయాన్ని నిర్ధారించగా మిగిలినవారు స్పందించాల్సి ఉంది. ఈ లెక్కన చూస్తే శ్రీరెడ్డి ఇందులో పాల్గొంటున్నారనే విషయంపై సందేహాలు వెలువడుతున్నాయి. ఈ వార్త కొంతమందికి సంతోషం కలిగిస్తున్నప్పటికీ సెన్సేషన్‌ల కోసం ఎదురుచూసేవారికి ఇది చేదువార్తే.