శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: గురువారం, 25 జులై 2019 (17:03 IST)

బిగ్ బాస్ అశురెడ్డిపై దారుణమైన కామెంట్లు.. ఏమైంది?

బిగ్ బాస్ 3లో కంటెస్టెంట్స్ మేమే అంటూ నూతన్ నాయుడు రిలీజ్ చేసిన వారే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే అందులో జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో పాపులర్ అయిన అశురెడ్డి పేరు కూడా ఉండడం.. ఆమె కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. 
 
అయితే తాజాగా అశురెడ్డి మీద దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయట. అశురెడ్డిని స్టేజ్ మీద చూసిన వారందరూ షాక్‌కు గురయ్యారు. ఏంటి సోషల్ మీడియాలో మనం చూస్తున్న అశురెడ్డానా అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. 
 
చాలా సన్నగా, అచ్చం సమంతకు డూప్‌లా ఉండే అశురెడ్డి చాలా బొద్దుగా కనిపించడంతో ఇన్నిరోజులు ఆమె స్లిమ్ పిల్లర్లను యూజ్ చేసిందేమో కానీ బిగ్ బాస్ కెమెరాలో స్లిమ్ పిల్లర్లు లేవుగా అంటూ అశురెడ్డి మీద తెగ ట్రోల్స్ చేస్తున్నారు. మరికొందరయితే... అమ్మాయి బొద్దుగా అయితే ఏంటి అంటూ అశురెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు. కానీ షో ప్రారంభమైనప్పటి నుంచి అశురెడ్డికి నెటిజన్ల వల్ల చాలా సమస్యలు వస్తున్నాయట.