గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 అక్టోబరు 2020 (13:58 IST)

పునర్నవి నిశ్చితార్థం.. రాహుల్ సిప్లిగింజ్ దేవదాస్ అయిపోయాడో..!

తెలుగు బిగ్‌బాస్‌ 3 ఫేమ్‌ పునర్నవి భూపాలం ఎంగేజ్‌మెంట్‌ అయిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఓ ఫోటోను కూడా పునర్నవి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. యూట్యూబ్‌ ఛానల్ చికాగో సుబ్బారావుతో పాపులర్‌ అయిన ఉద్భవ్‌తో ఆమె ఎంగేజ్‌మెంట్‌ అయినట్టు తెలిపింది. ఈ వార్తను చూసి ఆమె అభిమానులు షాక్‌ అయ్యారు. కారణం ఆమె బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నంత సేపు మరో కంటెస్టెంట్ అండ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో క్లోజ్‌గా ఉండడం. ఇంకా వీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. 
 
కానీ ఇప్పుడు పునర్నవి మరో వ్యక్తిని పెళ్ళి చేసుకోబోతున్నట్టు ప్రకటించడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక అది అలా ఉంటే సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌ తన ఇన్ స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. నా భయాలను మోసం చేశాను, నా సందేహాలతో బ్రేక్ అప్ అయ్యాను. నా విశ్వాసానికి నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు నేను నా కలలను పెళ్లి చేసుకున్నాను అంటూ ఎమోషనల్‌గా పోస్ట్ పెట్టాడు. దీంతో ప్రస్తుతం రాహుల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
పునర్నవి పెళ్లి వార్త నేపథ్యంలో రాహుల్ ఇలాంటీ పోస్ట్ పెట్టడంతో ఆయన అభిమానులు, నెటిజన్స్ బాధపడుతున్నారు. పునర్నవి తమ అభిమాన సింగర్‌ను మోసం చేసిందని కామెంట్స్ పెడుతున్నారు. ఇక దానికి కొనసాగింపుగా.. రాహుల్ మరో పోస్ట్ పెట్టాడు. ఎవరికో ఎంగేజ్ మెంట్ అయితే నన్ను ఎందుకు ట్యాగ్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తూ మరో పోస్ట్ పెట్టాడు.
 
ఇక పునర్నవి విషయానికి వస్తే.. ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాజ్ తరుణ్, అవికాగోర్ హీరో హీరోయిన్స్‌గా నటించారు. ఆ తర్వాత పునర్నవి.., శర్వానంద్ హీరోగా వచ్చిన 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' సినిమాలో హీరో కూతురుగా నటించింది. ఆ మధ్య 'పిట్టగోడ' అనే సినిమాలో హీరోయిన్‌గా కూడ యాక్ట్ చేసి తెలుగు ప్రేక్షకుల మెప్పుపొందింది.
 
కానీ అప్పటి వరకు ఎవరికీ అంతగా పరిచయం లేని పేరు అది. ఎప్పుడైతే బిగ్‌బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గోందో.. అప్పటినుంచి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు బిగ్‌బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌తో ఈమె పండించిన ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కు ఆడియన్స్ ఫిదా అయిన సంగతి తెలిసిందే.