బుధవారం, 11 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 సెప్టెంబరు 2023 (13:22 IST)

ఓజీలో పవన్‌తో నటించడంపై బిగ్ బాస్ 7 కంటిస్టెంట్ హ్యాపీ

subhasree
subhasree
పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీ ఓజీపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవల విడుదలైన హంగ్రీ చిరుత గ్లింప్స్‌తో, ఈ చిత్రం సినీ ప్రేమికులలో మంచి బజ్‌ని సృష్టించింది. పవన్ కళ్యాణ్ యాక్షన్ చూసి ప్రేక్షకులు పండుగ చేసుకుంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న సుభశ్రీ రాయగురు ఓజీ చిత్రంలో ఓ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఓజీ చిత్రంలో నటించానని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. అయితే ఆమె ఎలాంటి పాత్ర పోషించిందనే విషయంపై క్లారిటీ లేదు.
 
మోడల్‌గా పేరు తెచ్చుకున్న శుభశ్రీ రాయగురు కొంతకాలం న్యాయవాదిగా కూడా పనిచేశారు. సుభాశ్రీ 2022లో రుద్రవీణ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తమిళంలో డెవిల్ సినిమా చేసింది. కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్‌లో కూడా ఆమె ఒక పాత్ర చేసింది. 
 
బిగ్ బాస్ 7వ తెలుగు సీజన్ హౌస్‌లోకి ప్రవేశించే ముందు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. సుజీత్ ఓజీని పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఓజీ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.