శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 8 సెప్టెంబరు 2019 (11:50 IST)

స్లిమ్ లుక్‌లో అదరగొడుతున్న నమిత

ఒకపుడు.. తన అంద చందాలతో అదరగొట్టిన హీరోయిన్ నమిత. సొంతం చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత అటు తెలుగు, ఇటు తమిళ చిత్ర పరిశ్రమల్లో నటిస్తూ యూత్‌ మనసును దోచకుంది. ఫలితంగా తమిళ ప్రేక్షకులు ఆమెకు ఏకంగా గుడిని కూడా కట్టారంటే ఆమెపై ఉన్న అభిమానం ఏపాటితో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 
 
ఈ నేపథ్యంలో వెంకటేష్ హీరోగా నటించిన "జెమినీ" చిత్రంలోనూ న‌టించిన న‌మిత‌ చివ‌రిగా "సింహా" చిత్రంలో బాల‌య్య‌తో ఆడిపాడింది. అయితే "మియా" అనే త‌మిళ చిత్ర షూటింగ్ స‌మ‌యంలో వీరేంద్ర‌, న‌మిత‌ల మ‌ధ్య పుట్టిన ప్రేమ పెళ్లిగా మారింది. తిరుపతి ఇస్కాన్ టెంపుల్లో వేదమంత్రాల సాక్షిగా గత యేడాది నవంబరు 24వ తేదీన ఒక్కటయ్యారు. 
 
ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్న న‌మిత త‌న ఫిజిక్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది. డైట్ మెయింటైన్ చేస్తూ ప‌లు వ‌ర్కవుట్స్‌తో స్లిమ్‌గా మారే ప్ర‌య‌త్నం చేస్తుంది. తాజాగా న‌మిత‌కి సంబంధించి సోష‌ల్ మీడియాలో ప‌లు ఫోటోలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అవి ఫ్యాన్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. న‌మిత బాల‌య్య తాజా చిత్రంలో విల‌న్‌గా క‌నిపించ‌నుంద‌నే ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.