మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By preethi
Last Updated : శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (14:27 IST)

ఇరవై నాలుగు గంటలు బాత్రూమ్ ఆపుకోవాలంటే ఎలా...?

నిన్నటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్‌ ఇంటి సభ్యులందరికీ టిక్కెట్ టు ఫినాలే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ విజేతగా నిలిచే 1 వ్యక్తి డైరెక్ట్‌గా ఫైనలిస్ట్‌ల జాబితాలో ఉండే అవకాశం కల్పించారు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో

నిన్నటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్‌ ఇంటి సభ్యులందరికీ టిక్కెట్ టు ఫినాలే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ విజేతగా నిలిచే 1 వ్యక్తి డైరెక్ట్‌గా ఫైనలిస్ట్‌ల జాబితాలో ఉండే అవకాశం కల్పించారు బిగ్ బాస్.


గార్డెన్ ఏరియాలో ఒక కారును ఉంచి, సైరన్ మోగగానే ఆ కారులో ముందుగా కూర్చునే ఐదుగురు కంటెస్టెంట్స్ 24 గంటలు పాటు ఆ కారు నుండి కాలు కింద పెట్టకుండా లోపలే ఉండాలని, చివరిగా ఎవరైతే మిగులుతారో ఆ వ్యక్తికి ‘టిక్కెట్ టు ఫినాలే లభిస్తుందని చెప్పారు.
 
అయితే 24 గంటల తర్వాత వరకు ఒకరి కంటే ఎక్కువ మంది వ్యక్తులు గనక కారులో ఉన్నట్లయితే ఎవరికీ ‘టిక్కెట్ టు ఫినాలే’ లభించదని ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ వారం నామినేషన్‌లో ఉన్నవారికి ఈ టిక్కెట్ లభించినప్పటికీ వారు ఈ వారం ఎలిమినేట్ అయితే ఇది వర్తించదని చెప్పారు. ఇక ఫైనల్స్ వరకు అన్ని వారాలు కౌషల్‌ను గీతా నామినేట్ చేసింది కాబట్టి, ఆయన ఇందులో పాల్గొనకుండా సంచాలకులుగా వ్యవహరించాలని బిగ్ బాస్ ఆదేశించారు.
 
ఇక మిగిలిన అందరూ కారు చుట్టూ మూగి, సైరన్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు కౌషల్ పెట్టిన రూల్స్ ప్రకారం కారుకి టచ్ కాకూడదు, రోల్ మైక్ టచ్ అయిందని అతడిని బయటికి వచ్చేయమన్నాడు. ఆ తర్వాత బ్యాక్ సీట్లో శ్యామల, సామ్రాట్, గీత కూర్చోగా, ముందు సీట్లో తనీష్, దీప్తి స్థానం సంపాదించారు. ఇక వీరిలో ఎవరు చివరి దాకా ఉంటారో చూడాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాలి.