గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By preethi
Last Updated : శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (14:10 IST)

కౌషల్ ఓవరాక్షన్... కారణం బిగ్ బాసేనా?

బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ టు 12 వారాలను పూర్తి చేసుకుని 13వ వారానికి చేరువైంది. ఇప్పటికి 8 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. టాలీవుడ్ మారథాన్ టాస్క్ ముగిసింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఎలా ఉంటారో ఊహించ

బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ టు 12 వారాలను పూర్తి చేసుకుని 13వ వారానికి చేరువైంది. ఇప్పటికి 8 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. టాలీవుడ్ మారథాన్ టాస్క్ ముగిసింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఎలా ఉంటారో ఊహించి బొమ్మ వేసి, ఆయన గురించి చెప్పమని కంటెస్టెంట్స్‌కి చెప్పగా పొగడ్తలతో ముంచేసారు. గీత, శ్యామల, దీప్తి ఒకే మంచంపై పడుకుని నిద్రపోవడం లేదని తెలిసేలా పాటలను హమ్ చేస్తూనే ఉన్నారు.
 
కాసేపటికి అందరూ లివింగ్ రూమ్ సోఫాలోకి వచ్చి కూర్చోగా కౌషల్ యథాప్రకారం అమ్మాయిల మీద నోరు పారేసుకున్నాడు. నిద్రపోయి ఫ్రెష్‌గా వచ్చారు అంటూ వీళ్లని పాయింట్ చేసి చెప్పగా గీతా మాధురి అతనితో వాదనకు దిగింది. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే ఆ రోజు పొద్దున కౌషల్ నిద్రపోయినందుకు కుక్కులు మొరిగాయి. అంతేకాకుండా టిక్కెట్ టు ఫినాలే టాస్క్ గురించి బిగ్ బాస్ వివరించగా అందరితో పాటు కౌషల్ సిద్ధంగా ఉన్నాడు.
 
కానీ బిగ్ బాస్ కౌషల్ అన్ని వారాలు నామినేట్ అయినందున ఆయనకు పాల్గొనే అర్హత లేదని, కనుక సంచాలకులుగా వ్యవహరించాలంటూ బిగ్ బాస్ చెప్పారు. ఈ అక్కసు ఆయనలో స్పష్టంగా కనిపించింది. కంటెస్టెంట్స్‌లో చాలా కఠినంగా వ్యవహరించాడు. కారుకు మైక్ టచ్ అయ్యిందని రోల్‌ను అందులో పాల్గొననివ్వలేదు. ఇక రేపటి ఎపిసోడ్‌లో ఫుల్‌గా వర్షం పడుతుండటంతో చలికి ఒణికిపోతూ దీప్తి దుప్పటి ఇవ్వమని అడగగా, ఒప్పుకోలేదు కౌశల్. ఇంకా ఏమి ఇబ్బందులు పెడతాడో చూడాలి.