శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 5 ఆగస్టు 2019 (15:28 IST)

బాబా భాస్కర్‌ని ఏమీ అనొద్దు.. ఏడ్చేసిన శ్రీముఖి.. జాఫర్ ఎలిమినేట్

బిగ్ బాస్ హౌస్ నుంచి బిగ్ బాస్ మొదటి వారంలో హేమ ఎలిమినేట్ అయిపోయింది. ఇక రెండోవారంలో జర్నలిస్ట్ జాఫర్ ఎలిమినేట్ అయ్యాడు. రెండో వారంలో చాలామంది నామినేట్ కోసం ఎంపికయ్యారు. చివరకు వరుణ్ సందేశ్, వితిక షేరు, జాఫర్ ముగ్గురు లిస్టులో ఉన్నారు. కానీ, ఆఖరికి జాఫర్ మాత్రం ఎలిమినేట్ అయిపోయారు. 
 
జాఫర్ వెళ్లిపోతున్న సమయంలో వరుణ్ సందేశ్‌కు ఓ మాట చెప్పాడు. బాబా బాస్కర్‌ను మాత్రం ఏమీ అనొద్దని సూచించాడు. జాఫర్ రెండు వారాల పాటు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నాడు. అయితే, అందరి కంటే ఎక్కువగా బాబా భాస్కర్‌తోనే అనుబంధం ఉంది. అయితే, జాఫర్ వెళ్లిపోతున్న సమయంలో అందరూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. 
 
శ్రీముఖి అయితే, ఎంతో ఏడ్చేసింది. జాఫర్ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సందర్భంగా పలు ప్రోమోలు వచ్చాయి. అందులో బాబా భాస్కర్, జాఫర్ మధ్య జరిగిన సరదా సంభాషణలు అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.