ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 25 సెప్టెంబరు 2017 (11:13 IST)

‘బిగ్‌బాస్‌’ సీజన్‌-1 విజేత శివబాలాజీ.. రూ.50 లక్షల ప్రైజ్‌మనీ

హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన హోస్ట్‌గా, ఆద్యంతం ఆసక్తిగా మొత్తం 70 రోజుల పాటు సాగిన బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో తొలి సీజన్ ఆదివారంతో ముగిసింది. ఈ షో అంతిమ విజేతగా సినీ నటుడు శివబాలాజీ నిలిచాడు. దీంతో

హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన హోస్ట్‌గా, ఆద్యంతం ఆసక్తిగా మొత్తం 70 రోజుల పాటు సాగిన బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో తొలి సీజన్ ఆదివారంతో ముగిసింది. ఈ షో అంతిమ విజేతగా సినీ నటుడు శివబాలాజీ నిలిచాడు. దీంతో విజేత రూ.50లక్షల బహుమతి గెలుచుకున్నారు. 
 
అలాగే, గ్రాండ్‌ ఫినాలేకు ఆదర్శ్‌, అర్చనా, హరితేజ, శివబాలాజీ, నవదీప్‌లు చేరగా ప్రేక్షకులు ఇచ్చిన తుది ఓటింగ్‌లో శివబాలాజీ గెలిచి ‘బిగ్‌బాస్‌ సీజన్‌-1’ విజేతగా అయ్యారు. 
 
* జులై 16న ప్రారంభమైన ‘బిగ్‌బాస్‌’ సెప్టెంబర్‌ 24 వరకూ 70 రోజుల పాటు సాగింది. 
* అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌ ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహించారు. 
* బిగ్ బాస్ సీజన్‌-1‌లో ఆదర్శ్‌, అర్చనా, హరితేజ, శివ బాలాజీ, ముమైత్‌ఖాన్‌, ప్రిన్స్‌, సమీర్‌, సంపూర్ణేష్‌బాబు, కత్తి కార్తీక, ధన్‌రాజ్‌, మధుప్రియ, కల్పన, మహేష్‌ కత్తిలు పాల్గొన్నారు. 
* వైల్డ్‌ కార్డ్‌ ద్వారా దీక్షా పంత్‌, నవదీప్‌లు ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి అడుగుపెట్టారు. 
* గ్రాండ్‌ ఫినాలేకు ఆదర్శ్‌, అర్చనా, హరితేజ, శివబాలాజీ, నవదీప్‌లు చేరారు. 
* విజేతగా శివబాలాజీ నిలిచారు. ఆదర్శ్‌ రన్నరప్‌గా నిలిచారు.