ఆదివారం, 12 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ivr
Last Updated : గురువారం, 15 జూన్ 2017 (22:44 IST)

బంగ్లాపై 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం... ఆదివారం పాకిస్తాన్‌తో ఫైనల్లో ఢీ

పులి-కుక్క బొమ్మలతో బంగ్లాదేశ్ లో చేసిన హంగామాను చీల్చి చెండాడింది టీమ్ ఇండియా. 265 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించి చాంపియన్స్ ట్రోఫీ 2017 పోటీల్లో ఫైనల్‌కు చేరింది. బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించి

పులి-కుక్క బొమ్మలతో బంగ్లాదేశ్ లో చేసిన హంగామాను చీల్చి చెండాడింది టీమ్ ఇండియా. 265 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించి చాంపియన్స్ ట్రోఫీ 2017 పోటీల్లో ఫైనల్‌కు చేరింది. బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించింది కోహ్లీ సేన. కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి మరో 9 ఓవర్లు మిగిలి వుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 
 
శిఖర్ ధావన్ - రోహిత్ శర్మ దూకుడుగా ఆడి మొదటి వికెట్టుకు 87 పరుగులు జోడించారు. 15 ఓవర్లో శిఖర్ ధావన్ 46 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి చెలరేగిపోయాడు. మరోవైపు రోహిత్ శర్మ వికెట్ల వద్ద పాతుకుపోయాడు. వీరిద్దరూ కలిసి ఉతుకుడు కార్యక్రమం చేపట్టారు. 
 
రోహిత్ శర్మ 129 బంతుల్లో 15X4, 1X6 సాయంతో 123 పరుగులు చేసి నాటవుట్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లి 78 బంతుల్లో 13X4 సాయంతో 96 పరుగులు చేశాడు. దీనితో టీమ్ ఇండియా ఫైనల్స్‌కి దూసుకెళ్లింది. ఆదివారం నాడు ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుతో ఫైనల్లో టీమిండియా ఆడుతుంది.