సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2022 (11:59 IST)

హిందీలో విడుదలకానున్న "బింబిసార"

Bimbisara song
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన కొత్త చిత్రం "బింబిసార". ఈ నెల 5వ తేదీన విడుదలైంది. తొలి రోజునే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని, ఇప్పటివరకు మంచి కలెక్షన్లతో దూసుకెళుతోంది. దీంతో ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లోనూ రిలీజ్ చేయాలని చిత్ర నిర్మాత, హీరో కళ్యాణ్ రామ్ నిర్ణయించారు. 
 
ఇందులో కళ్యాణ్ రామ్ మూడు విభిన్న గెటప్‌లలో కనిపించారు. ఆయన సరసన కేథరిన్, సంయుక్తా మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. ఇపుడు తెలుగులో మంచి విజయాన్ని సాధించడంతో మిగిలిన భాషల్లోకి అనువదించే పనుల్లో నిమగ్నమయ్యారు. 
 
ఇప్పటికే నిఖిల్ సిద్ధార్థ్ నటించిన "కార్తికేయ-2" చిత్రం హిందీలో విడుదలై మంచి కలెక్షన్లను రాబడుతోంది. దీంతో "బింబిసార"ను హిందీలోకి హిందీలో రిలీజ్ చేయాలన్న తలంపుతో వారు ఉన్నారు.