మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 21 నవంబరు 2017 (14:12 IST)

గంటలకొద్దీ ముద్దు ఇవ్వాలంటూ నటిని ఏదేదో చేశారట... బీర్ తాగుతూ...

బాలీవుడ్ సినీ నటి జరీన్ ఖాన్ పైన ఆ చిత్ర యూనిట్ బృందంలోని కొందరు సభ్యులు అసభ్యంగా ప్రవర్తించారట. వివరాల్లోకి వెళితే అక్సర్ 2 చిత్రంలో జరీన్ ఖాన్ నటిస్తోంది. ఈ చిత్ర నిర్మాత, దర్శకుడు చెప్పింది ఒకటి చేసింది ఒకటి అని ఆమె ఆరోపిస్తోంది. తను నటించే ప్రతి

బాలీవుడ్ సినీ నటి జరీన్ ఖాన్ పైన ఆ చిత్ర యూనిట్ బృందంలోని కొందరు సభ్యులు అసభ్యంగా ప్రవర్తించారట. వివరాల్లోకి వెళితే అక్సర్ 2 చిత్రంలో జరీన్ ఖాన్ నటిస్తోంది. ఈ చిత్ర నిర్మాత, దర్శకుడు చెప్పింది ఒకటి చేసింది ఒకటి అని ఆమె ఆరోపిస్తోంది. తను నటించే ప్రతి ఫ్రేమ్‌లోనూ ముప్పావు వంతు శరీరాన్ని చూపే విధంగా కాస్ట్యూమ్స్ వేసుకోవాలని కండిషన్లు పెట్టారట. తనతో ఆ చిత్రంలో పెద్దగా ఎక్స్‌పోజ్ చేయనవసరం లేదని చెప్పి ఇలాంటి దుస్తులు వేయించడంపై నిలదీస్తే సమాధానం చెప్పకుండా ఇలాగే చేయాలని పట్టుబట్టారట.
 
వారి చేష్టలతో అసహనం చెంది, అలాంటి సీన్లలో నటించనని చెప్పగానే వారు తనతో వాదనకు దిగారట. తన వ్యక్తిగత స్టయిలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేసారట. ఇంకా ఆమె మాట్లాడుతూ.. 'ప్రతిరోజూ నా దుస్తులను రకరకాల ఆకృతుల్లో కురచగా ధరించాలని కోరారు. ఆ దుస్తులు వేసుకుంటే నా శరీరం ముప్పావంతుకు పైగా ఎక్స్‌పోజ్ చేసేట్లుగా వుంటుంది. నేను బికినీలు వేసేందుకు ఏమీ అభ్యంతరం చెప్పలేదు. కానీ అంతకంటే హీనమైన దుస్తులు వేసుకోవాలంటే ఎలా?
 
ఆఖరికి ముద్దు సీన్లకు కూడా ఎదురుతిరగలేదు. కానీ దీన్ని సాకుగా తీసుకుని ముద్దు పెట్టే సన్నివేశాన్ని నిమిషాలు, గంటలపాటు సాగదీశారు. నిమిషాలపాటు అలాగే ముద్దిస్తూ వుండాలని, సీన్ బాగా వచ్చేవరకూ అలాగే వుండాలంటూ కండిషన్లు పెట్టారు. అంతేకాకుండా వల్గర్ యాంగిల్స్‌లో నన్ను చూపించారు. అవన్నీ చిత్రం నుంచి తొలగించాలని అడిగితే నాపై గొడవకు దిగారు. అలాంటి సన్నివేశాలు తీస్తున్న సమయంలో కొందరు బీర్ తాగి నాపట్ల అసభ్యంగా ప్రవర్తించార'ని జరీన్ తెలియజేసింది. ఐతే జరీన్ వ్యాఖ్యలను ఆ చిత్ర నిర్మాత తోసిపుచ్చారు. జరీన్ ఖాన్ ఇలా ప్రవర్తించడం కొత్తేమీ కాదనీ, గతంలో కూడా ఇలాంటి చేష్టలు చాలనే చేసిందంటూ చెప్పుకొచ్చారు.