శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 సెప్టెంబరు 2021 (12:33 IST)

నేనేం ఆట వస్తువును కాదు.. కొనడానికి..? షేక్‌కు షాకిచ్చిన మోడల్

Brazilian Model
బ్రెజిల్‌కు చెందిన ఓ మోడల్‌ ఒంటరి జీవితం గడపాలనుకుంది. అందుకే తనను తానే పెళ్లి చేసుకుంది. 33 ఏళ్ల మోడల్ క్రిస్ గలెరా తనను తాను పెళ్లి చేసుకున్న క్రిస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరు తన పెళ్లి గురించే మాట్లాడుతున్నారు. క్రిస్ గలెరా పెళ్లి ఫోటోలు చూసిన అరబ్ షేక్ ఆకర్షితుడయ్యాడు. దీంతో ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు షేక్.. తనను మ్యారేజ్ చేసుకోవాలని ప్రపోజల్ చేశాడు. 
 
అందుకు గాను నాలుగు కోట్ల ఎదురు కట్నం ఇస్తానని ప్రకటించాడు. నీకు నువ్వు విడాకులు తీసుకోని తనను పెళ్లి చేసుకోమని కోరాడు షేక్.. ప్రపోజల్ పంపిన షేక్‌తో ఫోన్‌లో మాట్లాడిన క్రిస్.. సింపుల్‌గా అతడి ప్రపోజల్‌ను రిజెక్టు చేసింది. ''నేనేం ఆటవస్తువు కాదు మీరు కొనడానికి..!" అంటూ షేక్ ఆఫర్‌ను తిరస్కరించింది. తనకు నచ్చినన్ని రోజులు ఇలాగే ఒంటరిగా గడుపుతానంటూ క్రిస్ పేర్కొంది.