చిరంజీవి సర్జా సతీమణి, హీరోయిన్.. మేఘన రెండో పెళ్లి చేసుకోబోతున్నారా?
కన్నడ, మలయాళ చిత్రసీమలోని అగ్ర కథానాయికలలో నటి మేఘన ఒకరు. గతేడాది ఆమె భర్త కన్నడ స్టార్ హీరో చిరంజీవీ సర్జా గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించాడు. ఆ సమయంలో నటి నాలుగు నెలల గర్భవతి. అనంతరం ఆమె ఓ కుమారుడికి జన్మనిచ్చింది.
అయితే ఆమెపై ప్రస్తుతం నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. చిరంజీవి సర్జా మృతి చెందిన ఏడాదికి తర్వాత మేఘన, కన్నడ 'బిగ్‌బాస్ 4' విన్నర్ ప్రథమ్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు రూమర్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వీటిపై ప్రథమ్ ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించారు. ఆయన యూట్యూబ్‌లోని ఓ వీడియోని షేర్ చేశాడు.
'వ్యూస్, డబ్బు కోసం ఇతరులకు ఇబ్బంది కలిగించేలా రూమర్స్ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికి వరకు ఈ వీడియోను పట్టించుకోలేదు కానీ దాదాపు 2.7 లక్షలపైగా దీన్ని చూశారు.
వీటిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటేనే ఇంకొకరు ఇలాంటివి పెట్టకుండా ఉంటారు' అని ఆయన తెలిపాడు. మరోవైపు మేఘనా రాజ్ ఇప్పటివరకు ఈ రూమర్స్‌పై స‍్పందించలేదు. కానీ తన దివంగత భర్త చిరంజీవి కోరిక మేరకు నటనపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.