సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 15 నవంబరు 2017 (15:59 IST)

ఉద్దేశ్యపూర్వకంగా చిరు ఫ్యామిలీని అవమానిస్తున్నారు : బన్నీవాసు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నంది అవార్డులపై గీతా ఆర్ట్స్‌ సంస్థలో అత్యంత కీలకంగా ఉన్న బన్నీవాసు అనే వ్యక్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. నంది అవార్డుల విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నంది అవార్డులపై గీతా ఆర్ట్స్‌ సంస్థలో అత్యంత కీలకంగా ఉన్న బన్నీవాసు అనే వ్యక్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. నంది అవార్డుల విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి తీరని అన్యాయం జరిగిందన్నాడు. ఉద్దేశ్యపూర్వకంగానే మెగా ఫ్యామిలీని అవమానపరుస్తున్నారని ఆరోపించారు. 
 
బుధవారం రాత్రి ప్రకటించిన నంది అవార్డులపై బన్నీ వాసు స్పందిస్తూ, మూడేళ్లకు ప్రకటించిన నంది అవార్డుల్లో మెగా కుటుంబానికి చెందిన ఒక్క హీరోకు కూడా ఉత్తమ నటుడు అవార్డు రాలేదని అసహనం వ్యక్తంచేశాడు. ఈ మూడేళ్ల కాలంలో మెగా హీరోలు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారని చెప్పాడు. 
 
రెండు కమర్షియల్ హిట్స్ ఇచ్చిన అల్లు అర్జున్‌కు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఇవ్వడమేంటని ప్రశ్నించాడు. ఇది ముమ్మాటికీ మెగా ఫ్యామిలీని అవమానించడమేనని వ్యాఖ్యానించాడు. చిరంజీవి ఫ్యామిలీ ఈ విషయాన్ని పట్టించుకోలేదని... అయినప్పటికీ, ఆవేదనను తట్టుకోలేక తాను ప్రశ్నిస్తున్నానని తెలిపాడు.
 
గతంలో 'మగధీర' సినిమాకు కూడా అన్యాయం జరిగిందని... జాతీయ స్థాయిలో ఈ సినిమాకు గుర్తింపు లభించినా, రాష్ట్ర స్థాయిలో మాత్రం గుర్తింపు దక్కలేదని బన్నీ వాసు ఆరోపించాడు. ఈ మూడేళ్ల అవార్డుల గురించి మాత్రమే తాను మాట్లాడటం లేదని... చిరంజీవి కుటుంబానికి గత కొన్నేళ్లుగా అన్యాయం జరుగుతోందన్నాడు.