సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: శనివారం, 3 జూన్ 2017 (16:43 IST)

'బాహుబలి' రికార్డులను బద్ధలు కొట్టే మరో ఇండియన్ సినిమా... కసిగా వున్న డైరెక్టర్...

తెలుగు చిత్ర సీమలోనే కాదు యావత్ ప్రపంచ సినీ చరిత్రలో బాహుబలి 1, 2 సినిమా సృష్టించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. మొదటి భాగం ఎంత హిట్ అయిందో, అంతకు రెట్టింపుగా రెండవ భాగం హిట్టయ్యింది. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ బాహుబలి సినిమా చూసి భళా ప్రభాస్ అంటూ

తెలుగు చిత్ర సీమలోనే కాదు యావత్ ప్రపంచ సినీ చరిత్రలో బాహుబలి 1, 2 సినిమా సృష్టించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. మొదటి భాగం ఎంత హిట్ అయిందో, అంతకు రెట్టింపుగా రెండవ భాగం హిట్టయ్యింది. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ బాహుబలి సినిమా చూసి భళా ప్రభాస్ అంటూ పొగడ్తలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. 
 
అయితే అలాంటి సినిమాను తలదన్నేలా మరో సినిమాను సిద్ధం చేశారు. సిద్ధం చేయడమే కాదు సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. ఇది నిజం. ఆ సినిమా రోబో-2. ఒక్కసారిగా 15 భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి శంకర్ సిద్ధమయ్యాడు. సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇక హీరో ఎవరో చెప్పనవసరం లేదు. దక్షిణ సూపర్ స్టార్ రజినీకాంత్. 
 
శంకర్‌తో పాటు రజినీ ఇద్దరూ కలిసి కూర్చుని ఒక నిర్ణయానికి వచ్చారట. అదే బాహుబలిని మించిన సినిమా రోబో-2 అవ్వాలని. రజినీ కంటే శంకర్ ఎంతో కసిగా ఉన్నారట. ఖచ్చితంగా సినిమా బాహుబలి కలెక్షన్ రికార్డులను బద్ధలు కొట్టాలని. అందుకే ఇన్ని భాషల్లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. కేవలం గ్రాఫిక్స్‌కే కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి రోబో-2 నిర్మాత సిద్ధంగా ఉన్నారట. బాహుబలి కన్నా రెట్టింపు గ్రాఫిక్‌లతో అందరినీ ఆకట్టుకునేలా చేయాలన్నదే దర్శకుడి ఆలోచన. మరి చూడాలి బాహుబలిని మించిన సినిమా రోబో-2 అవుతుందో లేక రోబో-1 లాగా మామూలుగా ఆడుతుందో...?