శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 2 నవంబరు 2018 (13:08 IST)

సీరియల్‌లో నటించనున్న ఆస్కార్ అవార్డు గ్రహీత.. ఆమె ఎవరు?

ఆస్కార్ అవార్డు గ్రహీత, ఆస్ట్రేలియాకు చెందిన కేట్ బ్లాంచెట్ తొలిసారిగా ఓ అమెరికన్ టీవీ సీరియల్‌లో నటించబోతోంది. ఆస్ట్రేలియాకు చెందిన కేట్‌ రెండు సార్లు ఆస్కార్‌, ఓసారి గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారాన్ని అందుకుంది. 
 
తొమ్మిది ఎపిసోడ్స్‌తో నిర్మిస్తున్న మిసెస్‌ అమెరికా సీరియల్‌లో కేట్‌ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఎమ్మి అవార్డు రచయిత దవ్హీ వాలర్‌ (మేడ్‌ మేన్‌), ఆస్కార్‌ నామినేటెడ్‌ నిర్మాత స్టాసీ షెర్‌తో ఎఫ్‌ఎక్స్‌ ప్రొడక్షన్స్‌ దీన్ని నిర్మిస్తోంది. 
 
బ్లాంచెట్‌ దీనికి ఎగ్జిక్యూటీవ్‌ ప్రొడ్యూసర్‌గా ఉంటుంది. మిసెస్‌ అమెరికా ప్రొడక్షన్‌ షెడ్యూల్‌ వచ్చే ఏడాది నుంచి ప్రారంభమవుతుంది. టీవీ సీరియల్‌లో కీలక పాత్రలో కనిపించనుండటం ఎంతో సంతోషంగా వుందని కేట్ తెలిపింది.