శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: శనివారం, 30 డిశెంబరు 2017 (15:07 IST)

విలన్ అవ్వాలన్న నా కోరిక నెరవేరుతోంది - చమ్మక్ చంద్ర

జబర్దస్త్‌తో చమ్మక్ చంద్రకు మంచి పేరే వచ్చింది. బుల్లితెరపైనే కాదు వెండితెర పైనా చమ్మక్ చంద్ర కొన్ని సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ పెద్ద అవకాశాలేవీ చమ్మక్ చంద్రకు రాలేదు. తాజాగా తమిళంలో చమ్మక్ చంద్రకు విలన్‌గా అవకాశం వచ్చింది. సేయల్ అనే సినిమాలో చమ్మ

జబర్దస్త్‌తో చమ్మక్ చంద్రకు మంచి పేరే వచ్చింది. బుల్లితెరపైనే కాదు వెండితెర పైనా చమ్మక్ చంద్ర కొన్ని సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ పెద్ద అవకాశాలేవీ చమ్మక్ చంద్రకు రాలేదు. తాజాగా తమిళంలో చమ్మక్ చంద్రకు విలన్‌గా అవకాశం వచ్చింది. సేయల్ అనే సినిమాలో చమ్మక్ చంద్ర విలన్‌గా నటిస్తున్నారు.
 
భారీ యాక్షన్ కథతో తెరకెక్కుతోంది సేయల్ సినిమా. దర్శకుడు రవి. గతంలో రవి భారీ విజయాలు సాధించిన సినిమాలనే తీశాడు. చమ్మక్ చంద్రకు రవి స్నేహితుడు. దీంతో చమ్మక్ చంద్రను ఈ సినిమాలో విలన్‌గా పెట్టాడు. నాకు విలన్‌గా చేయాలని ఎప్పటినుంచో ఉంది. ఆ కోరిక కాస్తా తమిళ సినిమాతో తీరిపోతోంది. విలన్‌గానే చేయమంటే చేయడానికి నేను సిద్థంగా ఉన్నానని చెబుతున్నాడు చమ్మక్ చంద్ర.