శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వి
Last Modified: బుధవారం, 15 జులై 2020 (18:16 IST)

మీలో ఆ సత్తా వుందా, ఐతే రండి అంటున్న మెగాబ్రదర్ నాగబాబు

మీలో అందర్ని అదరగొట్టి నవ్వించే సత్తా ఉందా, అయితే ఇదిగో అవకాశమని తన అప్‌కమింగ్ కామెడి షోకు ఆహ్వానిస్తున్నారు నాగబాబు. త్వరలో ఆయన రెండు షోలను మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. నాగబాబు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తాన్నారు.
 
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, అదిరింది, జబర్దస్త్ వంటి షోల్లో మీకు అవకాశం దక్కలేదా.. అయితే మీకోసం అవకాశం వేచి వుందన్నారు. సత్తా వున్న ప్రతి ఒక్కరికీ ఇందులో అవకాశం ఉందన్నారు. తన లాంటి వారిని నవ్వించగలిగే సత్తా మీలో ఉంటే మీకు అవకాశం తప్పనిసరని చెపుతున్నారు మెగాబ్రదర్.