శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : గురువారం, 26 జనవరి 2017 (15:32 IST)

సెన్సార్‌కు సిద్ధ‌మైన `చంద్రుళ్ళో ఉండే కుందేలు`

మేఘన, సృజన, ప్రత్యూష, జస్వంత్ సమర్పణలో శ్రీ సిద్ధి సెవెన్ హిల్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై క్రాంతి చంద్, అవితేజ్, ప్రదీప్, అర్జున్, కోయల్ దాస్, సుపూర్ణ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం ‘చంద్రుళ్ళో ఉం

మేఘన, సృజన, ప్రత్యూష, జస్వంత్ సమర్పణలో శ్రీ సిద్ధి సెవెన్ హిల్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై క్రాంతి చంద్, అవితేజ్, ప్రదీప్, అర్జున్, కోయల్ దాస్, సుపూర్ణ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం ‘చంద్రుళ్ళో ఉండే కుందేలు’.  వెంకటరెడ్డి ఉసిరిక దర్శకత్వంలో ధన శ్రీనివాస్ జామి, లక్ష్మీ వెంకటరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. 
 
సినిమా సెన్సార్‌కు సిద్ధ‌మ‌వుతున్న సంద‌ర్భంగా దర్శకుడు వెంకటరెడ్డి ఉసిరిక మాట్లాడుతూ... 'ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న మా చిత్రం `చంద్రుళ్ళో ఉండే కుందేలు` నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు స‌హా అన్నింటినీ పూర్తి చేసుకుని సెన్సార్‌కు సిద్ధ‌మైంది. నటీనటులు అందరూ చ‌క్క‌గా న‌టించారు. వీరితో పాటు రంగ‌నాథ్‌గారు, సుమన్, నాజ‌ర్‌, త‌నికెళ్ళ భ‌ర‌ణిగారు, రాజీవ్ క‌న‌కాల‌, తాగుబోతు ర‌మేష్‌, కాదంబ‌రి కిర‌ణ్‌, స‌ప్త‌గిరి స‌హా సీనియ‌ర్ అండ్ ఫేమ్ ఉన్న ఆర్టిస్టులు కూడా మా సినిమాలో న‌టించ‌డం సినిమాకెంతో ప్ల‌స్ అయ్యింది. 
 
దాము న‌ర్రావుల సినిమాటోగ్ర‌ఫీ, విజ‌య్ గోర్తి సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. అంద‌రూ న‌టీన‌టులు, టెక్నిషియన్స్ స‌హాయంతో సినిమాను అనుకున్న స‌మయంలో పూర్తి చేయ‌గ‌లిగాం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. కుటుంబంలో ప్ర‌తి ఒక్క‌రికీ న‌చ్చేలా ఉండే సినిమా అవుతుంది. నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు కూడా పూర్తయ్యాయి. సినిమా సెన్సార్‌కు సిద్ధ‌మైంది. సెన్సార్ పూర్త‌యిన త‌ర్వాత విడుద‌ల తేదీని తెలియ‌జేస్తాం' అన్నారు.