శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 మే 2023 (22:00 IST)

హిందీ 'ఛత్రపతి' ట్రైలర్ రిలీజ్

Chatrapathi
Chatrapathi
హిందీ 'ఛత్రపతి' చిత్రం ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం అదే పేరుతో విడుదల కానుంది.  ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. 
 
ఇందులో శ్రీనివాస్ బెల్లం కొండ హీరోగా నటించగా, నుష్రత్ భారుచ్చాతో హీరోయిన్‌గా పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రం ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో అరంగేట్రం చేస్తున్నాడు. జయంతిలాల్ గడా (పెన్ స్టూడియోస్) సమర్పిస్తున్న ఈ చిత్రం మే 12న దేశవ్యాప్తంగా విడుదల కానుంది.