మంగళవారం, 4 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : సోమవారం, 3 మార్చి 2025 (17:37 IST)

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

Vicky Kaushal, Chava
ఛావా తెలుగు ట్రైలర్ నాలుగు గంటల్లో వన్ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్ లోకి వచ్చింది. 42 వేల లైక్స్ వచ్చాయి. సినిమా జనాల్లోకి వెళ్ళింది. సినిమాకి చాలా మంచి బజ్ వుంది. చాలా అద్భుతమైన కథ కథనం వున్న మంచి సినిమా ఇది. అందరూ కూడా ఈ సినిమాకు వచ్చి సినిమాకి పెద్ద విజయం అందించాలని కోరుకుంటున్నాను' అని బన్నీ వాస్ అన్నారు 
 
-దినేష్ విజన్ మాడ్డాక్ ఫిల్మ్స్ బ్లాక్ బస్టర్ 'ఛావా' రోరింగ్ తెలుగు ట్రైలర్ రిలీజ్- తెలుగు రాష్ట్రాల్లో గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మార్చి 7న మూవీ గ్రాండ్ గా రిలీజ్
 
ఛత్రపతి శంభాజీ మహారాజ్ అజేయమైన స్ఫూర్తిని, ధైర్యాన్ని సెలబ్రేట్ చేసుకునే చారిత్రక ఇతిహాసం ఛావా తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. దినేష్ విజన్ మాడ్డాక్ ఫిల్మ్స్ నిర్మించి, లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన చావాలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించారు. హిందీ వెర్షన్ భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన తర్వాత ఈ పవర్ ఫుల్ కథను తెలుగులోకి డబ్ చేసి మార్చి 7న థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఛావా తెలుగు వెర్షన్‌ను గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ విభాగం గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.  
 
ఈరోజు సినిమా తెలుగు ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణం తరువాత, మరాఠా సామ్రాజ్యం మొఘల్ ఆధిపత్య ముప్పును ఎదుర్కొంటుంది, కానీ అతని వారసత్వం అతని కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ ద్వారా కొనసాగుతుంది. శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ అద్భుతంగా నటించారు. "సింహం పోవచ్చు, కానీ దాని పిల్ల ఇప్పటికీ అడవిలో వేటాడుతూనే ఉంది" అనే  పవర్ ఫుల్ లైన్ తో కౌశల్ శంభాజీ ధైర్యాన్ని ప్రతిబింబిస్తాడు, గెరిల్లా యుద్ధానికి నాయకత్వం వహిస్తాడు. శత్రువులను తరిమికొడతాడు. అక్షయ్ ఖన్నాను మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుగా పరిచయం చేయగా, రష్మిక మందన్న శంభాజీ భార్య యేసుబాయిగా కనిపిస్తుంది.
 
విక్కీ కౌశల్ ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ పాత్రకు జీవం పోశాడు. తన పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. అక్షయ్ ఖన్నా, రష్మిక మందన్న వారి వారి పాత్రలలో ఆకట్టుకున్నారు.
 
ఈ సినిమాలోని ప్రతి ఎమోషన్, యాక్షన్ మూమెంట్ ని AR రెహమాన్ నేపథ్య సంగీతం మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. యుద్ధ సన్నివేశాలు మరాఠా యోధుడి పోరాట స్ఫూర్తిని ప్రజెంట్ చేశాయి. కాస్ట్యూమ్స్, మేకప్, ప్రొడక్షన్ డిజైన్ నాటి యుగానికి తీసుకెళ్ళాయి. సౌరభ్ గోస్వామి (ISC) సినిమాటోగ్రఫీ అద్భుతంగా వుంది. తెలుగులో ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ట్రైలర్ అంచనాలని మరింత పెంచింది.
 
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ.. ఛావా సినిమాని మార్చి 7న తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా హిందీలో ఎంత పెద్ద ప్రభంజనం సృష్టించిందో మనందరికీ తెలుసు. అంత మంచి సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నందుకు చాలా గర్వపడుతుతున్నాం. భాష ఏదైనా మంచి సినిమా అయితే దాన్ని తెలుగులో తీసుకురావడానికి గీతా ఆర్ట్స్ ఎప్పుడూ ముందుంటుంది. గజిని, 2018, కాంతార.. ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా అద్భుతంగా ఆదరిస్తారు. దానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. ఛావా సినిమాని కూడా అంత గొప్పగా ఆదరిస్తారని నమ్మకం ఉంది అన్నారు