చిరంజీవి సినిమా జిరాక్స్ కాపీ.. బాలయ్య చిత్రం చరిత్ర : కథా రచయిత చిన్నికృష్ణ
గతంలో తెలుగు చిత్ర పరిశ్రమలో తన కథలతో సూపర్ డూపర్ హిట్స్ అందించిన కథా రచయితల్లో చిన్నికృష్ణ ఒకరు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. అయితే, ఈయన ఇటీవల ఓ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
గతంలో తెలుగు చిత్ర పరిశ్రమలో తన కథలతో సూపర్ డూపర్ హిట్స్ అందించిన కథా రచయితల్లో చిన్నికృష్ణ ఒకరు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. అయితే, ఈయన ఇటీవల ఓ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన చేసిన వ్యాఖ్యలు ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్నాయి.
రచయితగా కెరీర్ ఆరంభంలో తన కథలతో పరిశ్రమకు బిగ్గెస్ట్ హిట్స్ అందించిన రైటర్ చిన్ని కృష్ణ. ఇటీవల ఓ పత్రికతో సంభాషిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.
ముఖ్యంగా... చిరంజీవి 150వ చిత్రం, బాలకృష్ణ 100వ చిత్రాలపై చిన్నికృష్ణ తన స్పందనను తెలియజేస్తూ.. 'అప్పట్లో సినిమాల మధ్య మంచి పోటీ ఉండేది. అది ఆసక్తికరంగానూ ఉండేది. 'నరసింహ నాయుడు', 'దేవీ పుత్రుడు', 'మృగరాజు' ఒకేసారి విడుదలయ్యాయి. ఆ పోటీ ఇప్పుడు లేదు. ఎవరి రక్షణ కోసం వారు సోలోగా వస్తున్నారు’’ అన్నారు.
ఇకపోతే.. వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణలు తలపడనున్నారు. ఇక్కడ, చిరు చేస్తున్న 'కత్తి' సినిమా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న కథ. బాలయ్య చారిత్రక కథతో వస్తున్నారు. రెంటినీ పోల్చి చెప్పలేం. చిరు సినిమా జిరాక్స్ కాపీ వంటిదన్నారు. ప్రస్తుతం ఈ 'జిరాక్స్' పరిశ్రమ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది.