1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: బుధవారం, 14 డిశెంబరు 2016 (20:32 IST)

చిరంజీవి పబ్లిసిటీ ఎక్కడ...?

చిరంజీవి తనను తాను ఆవిష్కరించేందుకు బుల్లితెరపై చేయనున్న పబ్లిసిటీ ఏమయింది? ఎంతవరకు వచ్చింది? అంటూ ఫిలింనగర్‌లో ప్రశ్నలు వేసుకుంటున్నారు. తన 150వ సినిమా ఖైదీ నెం.150వ సినిమా కోసం ఎలాగైనా పబ్లిసీటీ పెంచుకోవాలి. మా టీవీలో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్

చిరంజీవి తనను తాను ఆవిష్కరించేందుకు బుల్లితెరపై చేయనున్న పబ్లిసిటీ ఏమయింది? ఎంతవరకు వచ్చింది? అంటూ ఫిలింనగర్‌లో ప్రశ్నలు వేసుకుంటున్నారు. తన 150వ సినిమా ఖైదీ నెం.150వ సినిమా కోసం ఎలాగైనా పబ్లిసీటీ పెంచుకోవాలి. మా టీవీలో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రామ్‌ను ప్లాన్‌ చేశారు. అందుకు డిసెంబర్‌ మొదటివారంలోనే వస్తున్నట్లు చెప్పారు. ఆ మధ్య పబ్లిసిటీ కూడా మా టీవీలో వచ్చింది. అయితే.. డిసెంబర్‌లో ఫలానా డేట్‌ అనకుండా ప్లాన్‌ చేశారు. కాగా, ఇందుకు కొన్ని చిక్కులు వచ్చాయని తెలుస్తోంది.
 
ప్రధాని మోడీ పుణ్యమా అని.. నోట్ల రద్దు వ్యవహారం.. యూత్‌ అంతా బ్యాంకుల చుట్టూ తిరగడంతో పాటు.. కోటి రూపాయలు ప్రైజ్‌ మనీగా పెట్టడం.. ఇబ్బందికరంగా వుందని టీవీ వర్గాలు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ కార్యక్రమానికి ఎలా తీసుకురావాలనే కోణంలో ఆలోచిస్తున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి. అయితే ముందుగానే నిర్ణయించిన షో కనుక దీనికి అటువంటి ఇబ్బంది రాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 
 
ఏదియేమైనా చిరంజీవి.. సినిమా ఇంకా నెలరోజులు వుంది కనుక.. డిసెంబర్‌ చివర్లో ఈ షోను ప్రదర్శించే వీలుందని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఏదిఏమైనా.. చిరంజీవి ఏది కొత్తగా తలపెట్టినా.. ఏదో చిక్కులు వస్తాయనేది ఇదొక వుదాహరణగా ఫిలింనగర్‌లో కొందరు అనుకుంటున్నారు.