శుక్రవారం, 18 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 28 ఆగస్టు 2016 (14:53 IST)

పవన్ స్పీచ్ కోసం షూటింగ్ బంద్ చేసి టీవీ ముందు కూర్చొన్న చిరంజీవి!

ప్రజారాజ్యం పార్టీ తరపున మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రచారం చేశారు.. పలు బహిరంగ సభల్లో వేర్వేరుగా మాట్లాడారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల మధ్య ప్రజారాజ్యం పార్టీ కాంగ

ప్రజారాజ్యం పార్టీ తరపున మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రచారం చేశారు.. పలు బహిరంగ సభల్లో వేర్వేరుగా మాట్లాడారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల మధ్య ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైపోయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. ఈ పార్టీకి ఆయనే నాయకుడు.. ఆయనే కార్యకర్తగా ఇప్పటికీ కొనసాగుతున్నారు. 
 
అయితే, జనసేన ఆధ్వర్యంలో శనివారం తిరుపతిలో బహిరంగ సభ జరిగింది. ఈ సభ గురించే ప్రతి ఒక్కరూ మాట్లాడుకున్నారు. చర్చించుకున్నారు. ఆ సభలో పవన్‌ ఏమి మాట్లాడతాడు, ఎవరిని విమర్శిస్తాడు అనే ఆతృతతో అందరూ ఎదురుచూశారు. సరిగ్గా 4.05 గంటలకు సభ ప్రారంభం కాగానే అందరూ టీవీలకు అతుక్కుపోయారు. 65 నిమిషాల పాటు పవన్ ప్రసంగం సాగింది. ఈ ప్రసంగం పూర్తయిన అనంతరం పవన్‌ వ్యాఖ్యల గురించి చర్చించుకున్నారు.
 
మరి ఇంతమంది ఎదురు చూసిన పవన్‌ బహిరంగ సభను ఆయన అన్నయ్య మెగాస్టార్‌ చిరంజీవి చూశారా? లేదా అనేది మెగా అభిమానుల్లో చర్చకు జరుగుతోంది. ఎందుకంటే ప్రస్తుతం చిరంజీవి తన 150వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఏమాత్రం విరామం లేకుండా షూటింగ్‌ చేస్తున్నారు. అయినా పవన్‌ బహిరంగ సభ కోసం చిరు తన షూటింగ్‌ను రద్దు చేసుకున్నారట. పవన్‌ సభ ప్రారంభమయ్యే సమయానికి తన షూటింగ్‌ను ఆపించి తమ్ముడి ప్రసంగాన్ని వినడానికి టీవీ ముందు కూర్చుండిపోయారట. పవన్‌ ఆవేశపూరితంగా ప్రసంగించడాన్ని ఆయన ఆసక్తిగా తిలకించారట.
 
సోదరుడి ప్రసంగం మొత్తాన్ని చిరంజీవి చాలా సీరియస్‌గా ఆలకించారు. పవన్‌ ప్రసంగం పూర్తయ్యే వరకు మౌనంగానే ఉన్నారట. మీటింగ్‌ పూర్తయిన తర్వాత ఎవరితోనూ పవన్‌ స్పీచ్‌ గురించి చర్చించకుండా తన పనిలో పడిపోయారట.