Raha: అలియా భట్‌ను మించిపోయిన రాహా.. క్యూట్‌గా హాయ్ చెప్తూ.. (వీడియో వైరల్)
Raha: గత ఏడాది లాగే కపూర్స్ ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుతుంది. అలియా భట్, రణబీర్ కపూర్ వారి కుమార్తె రాహా క్రిస్మస్ వేడుకల్లో కనువిందు చేశారు. ఫ్యాన్స్‌కు అలియా భట్ ఫ్యామిలీ ఫోటోలు ఎంతో సంతోషాన్నిచ్చాయి. ఈ సందర్భంగా అలియా భట్ తరహాలోనే ఆమె కుమార్తె రాహా మీడియాను ఆకట్టుకుంది. ఫోటో గ్రాఫర్లకు చక్కటి ఫోజులిచ్చింది. క్యూట్‌గా చేతులు వూపుతూ అభివాదం చేసింది.
అందమైన తెల్లటి ఫ్రాక్ ధరించి తన తండ్రి ఒడిలో దాక్కుని, అందరికీ "హాయ్, మెర్రీ క్రిస్మస్" అన్నట్లు చేతులు ఊపింది. ఇంకా ప్లెయిన్ కిస్సులిచ్చింది. ఈ సందర్భంగా, అలియా భట్ ఎరుపు రంగు మ్యాక్సీ డ్రెస్ వేసుకోగా, రణబీర్ కపూర్ క్యాజువల్‌గా ఎంచుకున్నాడు. రాహా కారు వైపు కదులుతూ వారికి ముద్దులు పెడుతూ కనిపించింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.