సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2023 (12:40 IST)

పోలీసులను ఆశ్రయించిన బాలీవుడ్ నటి వైష్ణవి ధనరాజ్

Vaishnavi Dhanraj
Vaishnavi Dhanraj
బాలీవుడ్ నటి వైష్ణవి ధనరాజ్ పోలీసులను ఆశ్రయించింది. తన కుటుంబసభ్యులు తనపై శారీరక హింసకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా  ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది. తనను కాపాడాలని.. తన ఒంటిపై గాయాలను చూపిస్తూ వీడియో చేయడం కలకలం రేపింది. 
 
తనకు ప్రాణహాని వుందని.. తన కుటుంబమే తనపై వేధింపులకు పాల్పడిందని చెప్పుకొచ్చింది. తనను బయటకు రానీయకుండా బంధించారని.. ఎలాగోలా తప్పించుకుని బయటపడినట్లు తెలిపింది.
 
న్యూస్ ఛానల్స్‌తో పాటూ ఇండస్ట్రీ వారు సాయం చేయండి అని ఓ వీడియో పోస్ట్ చేసింది. వీడియోలో తన నోరు, కుడిచేయి మణికట్టుపై ఉన్న గాయాలను కూడా ఆమె కెమెరాకు చూపించింది. దాంతో ఈ వీడియో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.