ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 13 ఆగస్టు 2018 (11:37 IST)

'కలర్స్' స్వాతికి పెళ్లి ఫిక్సయింది... వరుడు ఎవరంటే...

బుల్లితెరపై కలర్స్ స్వాతిగా పేరు తెచ్చుకుని ఆ తర్వాత వెండితెరపై అరంగేట్రం చేసిన నటి 'కలర్స్' స్వాతి. ఈమె అష్టాచెమ్మా చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత దక్షిణాదిలో అన్ని భాషల్లో

బుల్లితెరపై కలర్స్ స్వాతిగా పేరు తెచ్చుకుని ఆ తర్వాత వెండితెరపై అరంగేట్రం చేసిన నటి 'కలర్స్' స్వాతి. ఈమె అష్టాచెమ్మా చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత దక్షిణాదిలో అన్ని భాషల్లో నటించింది. అదేసమయంలో పలువురు హీరోలతో సంబంధాలు ఉన్నట్టు అనేక రకాలైన గాసిప్స్ వచ్చాయి.
 
ఈ క్రమంలో తాజాగా ఆమె పెళ్లి ఫిక్స్ అయింద‌నే వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. మ‌లేషియ‌న్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్న వికాస్ అనే వ్య‌క్తితో స్వాతి పెళ్లి ఫిక్స్ అయిన‌ట్టు సమాచారం. 
 
గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న వీరిద్దరూ త్వరలోనే పెద్దల అనుమ‌తితో పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు స‌మాచారం. ఈనెల 30వ తేదీన పెళ్లి చేసుకుని ఆ తర్వాత రిసెప్ష‌న్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు వినికిడి. మ‌రి, ఈ వార్త‌లో నిజ‌మెంతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.