గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 29 ఆగస్టు 2019 (09:58 IST)

#PawanKalyanBirthdayCDP హ్యాపీ బర్త్‌డే టూ బాబాయ్... మార్చు వచ్చేవరకు ఎత్తులేస్తా

జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు సెప్టెంబరు 2వ తేదీన జరుగనున్నాయి. ఆ రోజున ఆయన 48వ పడిలోకి అడుగుపెట్టనున్నారు. పైగా, తమ అభిమాన హీరో పుట్టిన రోజును ఘనంగా జరుపుకునేందుకు ఆయన అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
మరోవైపు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ఓ గిఫ్టు ఇచ్చారు. పవన్ పుట్టినరోజు కోసం కామన్ డీపీని విడుదల చేశారు. అందులో ఓ ఫొటోలో పవన్ నవ్వుతూ ఉండగా.. మరో ఫొటోలో ఏదో ఆలోచిస్తున్నట్లు ఉన్నాడు. అంతేకాదు ఈ పోస్టర్‌లో జనసేనాని అనే టైటిల్‌.. మార్పు వచ్చే వరకు ఎత్తులేస్తా అనే కామెంట్‌ ఉంది.
 
దీన్ని ఇన్‌స్టాలో షేర్ చేసిన చెర్రీ.. కల్యాణ్ బాబాయి పుట్టినరోజుకు ఇది కామన్ డీపీ. ప్రజలకు మంచి చేయాలని ఆయన ఎప్పుడూ పరితపిస్తూనే ఉంటారు. ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు మనందరం ఏకతాటిపైన నిలబడదాం అని కామెంట్ పెట్టాడు. ఇక ఈ ఫొటోను రామ్ చరణ్ పెట్టిన కాసేపటికే.. మెగా అభిమానులు చాలామంది దాన్ని తమ డీపీగా పెట్టుకోవడం గమనార్హం.